మైత్రేయ మహర్షి బోధనలు - 38
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 38 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 27. మృత్యుంజయ మార్గము 🌻
ప్రతి సంస్కృతి యందును మరణించిన జీవుని వెంట తోడుగ ఒక దేవతయో, పితృదేవతయో, సిద్ధుడో కొంత దూరము పయనించి, మరొక లోకమును చేరుటకు సహకరించునని నానుడి కలదు. అనగా, మరణించిన జీవుడు గోరియందే బందీకృతుడై యుండడని దీని అవగాహన. ఇహలోకముకన్న యితరలోకములు గలవన్నది మరి యొక అవగాహన. ఉత్తమ లోకములు చేరుటకు ఒక సహాయకుని గురువని పిలుచుట ప్రాచీన సంప్రదాయము.
ప్రతి సంస్కృతి యందును గురువునకు, అధ్యాపకునునకు ఒక విశిష్టస్థానము గలదు. గురువును, అధ్యాపకుని గౌరవించు సంస్కృతికి, సంఘమునకు పతనము కలుగదు. ఎంతటి కష్టనష్టముల నుండైనను అట్టి జాతి ఉత్తీర్ణత పొందలదు. గురుబోధ, అధ్యయనములు మృత్యుంజయ ములు. అవి లేని జీవనము మరణముతో సమానమే. మృత్యుంజయ మార్గమున జీవులను ఉత్తీర్ణులను చేయుటయే మా దీక్ష!
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
06 Dec 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment