శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 325 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 325-2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 325 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 325-2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమ ప్రియా ।
కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀

🌻 325-2. 'జగతీకందా' 🌻

కాలము మడతలలో నున్న మార్పులు తెలియుట సులభము కాదు. ప్రకృతి కాలము ననుసరించి సమస్త సృష్టి చేయును. శుద్ధ చైతన్యము నుండి ప్రజ్ఞా లోకములు, శక్తి లోకములు, పదార్థమయ లోకములు కాలమును నూతగ గొని శ్రీమాతయే నిర్మించు చున్నది. నిర్మించి వాటిని పూరించు చున్నది. కేవలము నిర్మించుటయే గాక వాటిని పూరించుట కూడ జరుపుచున్నది. నిర్మించుట, పూరించుటను కంద అను పదము సంకేతించు చున్నది. మూలములలో కంద మూలము ప్రత్యేకత కలది.

మూలము లన్నియూ క్రమముగ వృద్ధి చెంది భూమిపైకి పెరుగును. వాని వృద్ధి దృశ్య గోచరము. కంద మూలము నుండి కందము అదృశ్యముగ పెరుగును. దృశ్యమానమగు ఈ జగత్తు నందు అదృశ్యముగ చైతన్య పూరణము నిత్యము జరుగుచునే యున్నది. జగత్తు నెప్పటికప్పుడు నిత్య నూతనముగ పూరించుట శ్రీమాత ప్రత్యేక లక్షణము. అందువలన సృష్టియం దేదియు అయిపోవుట వుండదు. అంతరించుట యుండదు. అది కేవలము మానవుని మనస్సు నందే యున్నది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 325-2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya
Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻

🌻 325-2. Jagatī -kandā जगती -कन्दा (325) 🌻

She is the cause of the universe. The cause for the origin of the universe is attributed to the Brahman. Her Brahmanic stature is repeatedly emphasized in this Sahasranāma through various attributes. She is ‘prakāśa vimarśa mahā māyā svarūpinī’ by which She creates the universe.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


06 Dec 2021

No comments:

Post a Comment