7-DECEMBER-2021 మంగళవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 07, మంగళవారం, డిసెంబర్ 2021 భౌమ వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 287 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 486🌹 
4) 🌹 వివేక చూడామణి - 163 / Viveka Chudamani - 163🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -115🌹  
6) 🌹 Osho Daily Meditations - 104🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 163 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 163🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*భౌమ వాసరే, 07, డిసెంబర్‌ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. ఆంజనేయుని శ్లోకాలు -7 🍀*

*గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం|*
*రామాయణం మహామాలారత్నం వందే అనిలాత్మజం||*

*భావము:- గోమాత యొక్క పాదాల మధ్య దూరాన్ని దాటినంత సునాయాసంగా సముద్రాన్ని దాటి దోమలను చంపినంత సులభంగా రాక్షసవధ చేసి రామాయణం అనే వజ్రమాలలో ఒక వజ్రంలాగా నిత్యం మెరిసే ఆంజనేయ నీకు నమస్కారము.*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: శుక్ల చవితి 23:42:40 
వరకు తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: ఉత్తరాషాఢ 24:13:20 
వరకు తదుపరి శ్రవణ
యోగం: వృధ్ధి 16:23:28 వరకు 
తదుపరి ధృవ
కరణం: వణిజ 13:06:52 వరకు
వర్జ్యం: 09:36:40 - 11:04:12
మరియు 27:56:40 - 29:26:32
దుర్ముహూర్తం: 08:47:04 - 09:31:35
రాహు కాలం: 14:54:25 - 16:17:54
గుళిక కాలం: 12:07:26 - 13:30:55
యమ గండం: 09:20:27 - 10:43:57
అభిజిత్ ముహూర్తం: 11:45 - 12:29
అమృత కాలం: 18:21:52 - 19:49:24
సూర్యోదయం: 06:33:29
సూర్యాస్తమయం: 17:41:24
వైదిక సూర్యోదయం: 06:37:21
వైదిక సూర్యాస్తమయం: 17:37:31
చంద్రోదయం: 09:38:41
చంద్రాస్తమయం: 20:59:07
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
మానస యోగం - కార్య లాభం 
18:41:00 వరకు తదుపరి పద్మ 
యోగం - ఐశ్వర్య ప్రాప్తి 
పండుగలు : 
మాస వినాయక చతుర్థి, 
Vinayaka Chaturthi
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -287 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 16-1
 
*🍀 16-1. సమస్తమును నేనే ! - వైదిక ధర్మమందు అనేక క్రతువులు తెలుపబడి యున్నవి. విధి విధానముగ ఆ క్రతువులు నిర్వర్తించు వారు క్రతు నిర్వహణమున నిమగ్నమై క్రతువును ఈశ్వరునిగ చూడరు. ఏదో ఒక తంతు నిర్వర్తిస్తున్నట్లు హడావిడిగ నుందురు. అట్లే యజ్ఞము చేయు వారు కూడ యజ్ఞవిధి యందు నిమగ్నమై, అందీశ్వరుని దర్శింపరు. స్వాహాకారములు బిగ్గరగ చేయుచు, బాగుగ పలికినామని గర్వ పడుదురే గాని ఆ స్వాహాకార రూపమున అవతరించి, హవిస్సును గొను ఈశ్వరుని దర్శింపరు. ఊర్ధ్వ ముఖముగ అగ్ని జ్వాలలు అనేక కాంతులతో ప్రజ్వరిల్లు చున్నపుడు అందీశ్వరుని దర్శింపరు. హుతమగుచున్న ద్రవ్యము దృశ్యలోకము నుండి అదృశ్య లోకము లోనికి ఉద్ధరింపబడుట చూడరు. 🍀*

*అహం క్రతు రహం యజ్ఞః స్వధాహ మహ మౌషధమ్ |*
*మంత్రోం హ మహమే వాణ్య మహమగ్ని రహం హుతమ్ || 16*

*తాత్పర్యము : క్రతువును నేనే. యజ్ఞమును నేనే. ఓషధులును నేనే. మంత్రము కూడ నేనే. హోమ ద్రవ్యమును నేనే. హోమమును నేనే. అందు హుతమగు ద్రవ్యము నేనే.*

*వివరణము : సమస్తమును ఈశ్వరుడగు నేనే అని తెలుపుటకు మరికొన్ని ఉదాహరణలు దైవము తెలుపుచున్నాడు. వైదిక ధర్మమందు అనేక క్రతువులు తెలుపబడి యున్నవి. విధి విధానముగ ఆ క్రతువులు నిర్వర్తించు వారు క్రతు నిర్వహణమున నిమగ్నమై క్రతువును ఈశ్వరునిగ చూడరు. ఏదో ఒక తంతు నిర్వర్తిస్తున్నట్లు హడావిడిగ నుందురు. అట్లే యజ్ఞము చేయు వారు కూడ యజ్ఞవిధి యందు నిమగ్నమై, అందీశ్వరుని దర్శింపరు. స్వాహాకారములు బిగ్గరగ చేయుచు, బాగుగ పలికినామని గర్వ పడుదురే గాని ఆ స్వాహాకార రూపమున అవతరించి, హవిస్సును గొను ఈశ్వరుని దర్శింపరు.*

*మంత్రములు అనుదాత్త, ఉదాత్త స్వరములతో చక్కగ పలుకు చున్నామనే అహంభావముతో చేతులు, తలలు, మెడలు త్రిప్పుదురే గాని మంత్ర రూపమున నున్న ఈశ్వరుని గమనింపరు. హోమ ద్రవ్యముల రూపమున, ఆవునేయి రూపమున యున్న ఈశ్వరుని దర్శింపక, వానిని హోమ ద్రవ్యములు గను, నేయిగను గుర్తింతురు. అంతేకాదు, ఊర్ధ్వ ముఖముగ అగ్ని జ్వాలలు అనేక కాంతులతో ప్రజ్వరిల్లు చున్నపుడు అందీశ్వరుని దర్శింపరు. హుతమగుచున్న ద్రవ్యము దృశ్యలోకము నుండి అదృశ్య లోకము లోనికి ఉద్ధరింపబడుట చూడరు. అట్టి ఉద్ధారణ రూపమున గూడ ఈశ్వరుడే యున్నాడు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 486 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 37

*🌻. పెళ్ళి హడావుడి - 5 🌻*

ఓ మహర్షీ! హిమవంతుడు పూర్వమే వారిని ఆనందముతో ఆహ్వానించి యుండెను. పార్వతీ పరమేశ్వరుల వివాహము గనుక వారందరు ప్రేమతో విచ్చేసిరి (41). అపుడు శోణా, భద్రా మొదలగు గొప్ప శోభగల నదులన్నియూ పార్వతీపరమేశ్వరుల వివాహము గనుక మహానందముతో విచ్చేసిరి (42).

నదులన్నియూ దివ్యరూపములను ధరించి అనేకములగు అలంకారములను పెట్టుకొని పార్వతీశివుల వివాహమను కారణముచే ప్రీతితో విచ్చేసిరి (43). గోదావరి, యమునా, సరస్వతి, మరియు వేణి అను నదులు పార్వతీ పరమేశ్వరుల వివాహమును దర్శించుటకై హిమవత్పర్వతమునకు విచ్చేసిరి (44)

 గంగానది పార్వతీ పరమేశ్వరుల వివాహమును దర్శించుట కొరకై దివ్యరూపమును ధరించి అనేకములగు భూషణములతో అలంకరించుకొని మహానందముతో విచ్చేసెను (45). రుద్రుని కుమార్తె, గొప్ప నదియగు నర్మద పార్వతీ పరమేశ్వరుల వివాహమను కారణముచే మహానందముతో శీఘ్రముగా విచ్చేసెను (46).

అన్ని వైపులనుండి విచ్చేసిన వారందరితో హిమవంతుని దివ్య నగరము అంతటా నిండియుండెను. ఆ నగరము సర్వవిధముల శోభలతో నలరారెను (47). అచట

మహోత్సవము ప్రవర్తిల్లెను. జెండాలు, ధ్వజములు, తోరణములు అధికముగా నుండెను. చాందినీల విస్తారముచే సూర్యకాంతి చొరకుండెను. అయిననూ, అనేక కాంతులతో ప్రకాశించెను (48). 

హిమవంతుడు మిక్కిలి ప్రీతితో ఆ పర్వతములకు, నదులకు యథోచితముగా సాదరముగా సన్మానమును చేసెను (49). వారినందరిని వేర్వేరు గృహములలో నివసింపజేసి సమస్త సామగ్రుల నేర్పాటుచేసి వారిని సంతోషపెట్టెను (50).

శ్రీ శివ మహాపురాణములోని రుద్రసంహిత యందు పార్వతీ ఖండలో పెళ్లి ఏర్పాట్లును వర్ణించే ముప్పది ఏడవ సర్గ ముగిసినది (37). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 163 / Viveka Chudamani - 163🌹*
*✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -10 🍀*

*533. ఎవరి ప్రకాశము సూర్యుని వలె విశ్వాన్ని ప్రకాశింపజేస్తుందో, అలానే పదార్థము కానిది, అసత్యమైనది, ప్రాధాన్యతలేనిది అయినది అసలు లేనే లేదు కదా! అనగా అవి స్వయముగా ప్రకాశించవని భావము.*

*534. నిజానికి ఏది బాహ్య వస్తువులను ప్రకాశింపజేస్తుందో, దాని వలన పురాణాలు, ఇతర గ్రంధాలు అలానే జీవులు, తగిన భావాలను వ్యక్తము చేయగలవు.*

*535. ఇచట స్వయం ప్రకాశవంతమైన ఆత్మ అనంత శక్తితో, ఏవిధమైన అభ్యంతరములేని జ్ఞానాన్ని ఇచ్చుటచే, అన్ని జీవులకు సంబంధించిన సాధారణ అనుభవాలను గ్రహించ గల బ్రహ్మజ్ఞాని అయిన వ్యక్తి తన గొప్ప జీవితమును ఏవిధమైన బంధనాలు లేకుండా జీవించగలడు.*

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 163 🌹*
*✍️ Sri Adi Shankaracharya*
*Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 32. I am the one who knows Brahman -10🌻*

*533. What indeed can manifest That whose lustre, like the sun, causes the whole universe – unsubstantial, unreal, insignificant – to appear at all ?*

*534. What, indeed, can illumine that Eternal Subject by which the Vedas and Puranas and other Scriptures, as well as all beings are endowed with a meaning ?*

*535. Here is the Self-effulgent Atman, of infinite power, beyond the range of conditioned knowledge, yet the common experience of all - realising which alone this incomparable knower of Brahman lives his glorious life, freed from bondage.*

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 163 🌹*
*✍️ Sri Adi Shankaracharya*
*Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 32. I am the one who knows Brahman -10🌻*

*533. What indeed can manifest That whose lustre, like the sun, causes the whole universe – unsubstantial, unreal, insignificant – to appear at all ?*

*534. What, indeed, can illumine that Eternal Subject by which the Vedas and Puranas and other Scriptures, as well as all beings are endowed with a meaning ?*

*535. Here is the Self-effulgent Atman, of infinite power, beyond the range of conditioned knowledge, yet the common experience of all - realising which alone this incomparable knower of Brahman lives his glorious life, freed from bondage.*

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 115 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు *
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. జ్ఞానులు- దైత్యులు - 3 🌻*

*దైత్యులకు తమ ఆస్తిపై గాని, తమకు‌ ఇష్టమున్న వారిపై గాని, తాము నమ్మిన దేవునిపై గాని, హోదాలపై గాని వీరి జీవిత సౌఖ్యము ఆధారపడి యుండును. దైవమును నమ్మితిమి అనుకొన్నను తాను కోరినది ఇచ్చువాడే దైవము గాని తన కన్నా దైవమునకు ఎక్కువ తెలియును అను నమ్మకముండదు. వీరందరు గూడ వేద శాస్ర్తాదుల యందు పాండిత్యము వహించి ఉందురు. కాని వీరి దృష్టిలో వేదమనగా కొన్ని విధి నిషేధ వాక్యముల గ్రంథము. దానితో ఎవరి వేదము వారికి ఉండును. ఎవరి వేదము నిజమైనది? అను సమస్య తీరదు. అంతర్యామి సాధన చేయువారికిని వేదమున్నది. వారికి ఈ సృష్టియే గ్రంథము. అందలి ప్రకృతి ధర్మములే శాస్త్రములు. 

*జీవరాసుల రూపములే దేవుని సజీవ విగ్రహములు. కష్ట సుఖములు ఆయా వ్యక్తులు చేసిన పనుల ఫలితములుగా అనుభవములు అగుచుండునే గాని దేవుడు కావలెనని కల్పించినవి కావు. ఈ రెండు తెగలవారు నరజాతి ఆవిర్భావము నుండి ఉన్నారు. రజస్తమస్సులు ప్రాధాన్యము వహించి పనిచేయుచున్నంత వరకు నరులు దైత్యజాతికి చెందిన జన్మలు అనుభవింతురు. సత్త్వగుణమున స్థిరత్వము కలిగిన నాటి నుండి దివ్యులు లేక ముముక్షువుల జన్మలు అనుభవింతురు....*

....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 104 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 104. ALMOST MAD 🍀*

*🕉 To become a seeker is almost to become mad as far as the world is concerned. So you are entering into madness. But that madness is the only sanity there is! 🕉*
 
*Our misery is that we have forgotten the language of love. The reason we have forgotten the language of love is that we have become too identified with reason. Nothing is wrong with reason, but it has a tendency to monopolize. It clings to the whole of your being. Then feeling suffers-feeling is starved-and by and by you forget about feeling completely. So it goes on shrinking and shrinking, and that dead feeling becomes a dead weight; that feeling becomes a dead heart.*

*Then one can go on pulling oneself along somehow-it will always be "somehow." There will be no charm, no magic, because without love there is no magic in life. And there will be no poetry either; life will be all prose, flat. Yes, it will have grammar, but it will not have a song in it. It will have a structure, but it will not have substance. The risk of moving from reason to feeling, and trying to bring a balance, is something only for those people who are really courageous-for mad people only-because the price of admittance is nothing but your reason-dominated mind, your logic-dominated mind, your mathematically dominated mind.*

*When that attitude is dropped, prose is no longer at the center, but poetry; purpose no longer at the center, but play; money no longer at the center, but meditation; power no longer at the center, but simplicity, nonpossessiveness, a sheer joy of life-almost a madness.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 163 / Sri Lalita Sahasranamavali - Meaning - 163 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 163. త్రయీ, త్రివర్గ నిలయా, త్రిస్థా, త్రిపురమాలినీ ।*
*నిరామయా, నిరాలంబా, స్వాత్మారామా, సుధాసృతిః ॥ 163 ॥ 🍀*

🍀 869. త్రయీ : 
వేదస్వరూపిణి

🍀 870. త్రివర్గ నిలయా : 
ధర్మార్ధ కామములకు నిలయం ఐయ్నది

🍀 871. త్రిస్థా : 
మూడు విధములుగా ఉండునది

🍀 872. త్రిపురమాలినీ : 
త్రిపురములను మాలికగా ధరించినది

🍀 873. నిరామయా : 
ఏ బాధలూ లేనిది

🍀 874. నిరాలంబా : 
ఆలంబనము అవసరము లేనిది

🍀 875. స్వాత్మారామా : 
తన ఆత్మయందే ఆనందించునది

🍀 876. సుధాసృతి: : 
అమృతమును కురిపించునది 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 163 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 163. Traei trivarganilaya trisdha tripuramalini*
*Niramaya niralanba svatmarama sudhasrutih ॥ 163 ॥ 🌻*

🌻 869 ) Thrayee -  
 She who is of the form of three Vedas viz Rik, yajur and sama

🌻 870 ) Trivarga nilaya -   
She who is in three aspects of self, assets and pleasure

🌻 871 ) Thristha -   
She who is in three 

🌻 872 ) Tripura malini -  
 She who is in tripura the sixth section of Srichakra

🌻 873 ) Niramaya -   
She who is without diseases

🌻 874 ) Niralamba -   
She who does not need another birth

🌻 875 ) Swatma rama -   
She who enjoys within herself

🌻 876 ) Sudha sruthi -   
She who is the rain of nectar

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామములు #LalithaSahasranam
 #PrasadBhardwaj 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://mymandir.page.link/wdh7G
https://t.me/ChaitanyaVijnanam 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment