గీతోపనిషత్తు -287
🌹. గీతోపనిషత్తు -287 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 16-1
🍀 16-1. సమస్తమును నేనే ! - వైదిక ధర్మమందు అనేక క్రతువులు తెలుపబడి యున్నవి. విధి విధానముగ ఆ క్రతువులు నిర్వర్తించు వారు క్రతు నిర్వహణమున నిమగ్నమై క్రతువును ఈశ్వరునిగ చూడరు. ఏదో ఒక తంతు నిర్వర్తిస్తున్నట్లు హడావిడిగ నుందురు. అట్లే యజ్ఞము చేయు వారు కూడ యజ్ఞవిధి యందు నిమగ్నమై, అందీశ్వరుని దర్శింపరు. స్వాహాకారములు బిగ్గరగ చేయుచు, బాగుగ పలికినామని గర్వ పడుదురే గాని ఆ స్వాహాకార రూపమున అవతరించి, హవిస్సును గొను ఈశ్వరుని దర్శింపరు. ఊర్ధ్వ ముఖముగ అగ్ని జ్వాలలు అనేక కాంతులతో ప్రజ్వరిల్లు చున్నపుడు అందీశ్వరుని దర్శింపరు. హుతమగుచున్న ద్రవ్యము దృశ్యలోకము నుండి అదృశ్య లోకము లోనికి ఉద్ధరింపబడుట చూడరు. 🍀
అహం క్రతు రహం యజ్ఞః స్వధాహ మహ మౌషధమ్ |
మంత్రోం హ మహమే వాణ్య మహమగ్ని రహం హుతమ్ || 16
తాత్పర్యము : క్రతువును నేనే. యజ్ఞమును నేనే. ఓషధులును నేనే. మంత్రము కూడ నేనే. హోమ ద్రవ్యమును నేనే. హోమమును నేనే. అందు హుతమగు ద్రవ్యము నేనే.
వివరణము : సమస్తమును ఈశ్వరుడగు నేనే అని తెలుపుటకు మరికొన్ని ఉదాహరణలు దైవము తెలుపుచున్నాడు. వైదిక ధర్మమందు అనేక క్రతువులు తెలుపబడి యున్నవి. విధి విధానముగ ఆ క్రతువులు నిర్వర్తించు వారు క్రతు నిర్వహణమున నిమగ్నమై క్రతువును ఈశ్వరునిగ చూడరు. ఏదో ఒక తంతు నిర్వర్తిస్తున్నట్లు హడావిడిగ నుందురు. అట్లే యజ్ఞము చేయు వారు కూడ యజ్ఞవిధి యందు నిమగ్నమై, అందీశ్వరుని దర్శింపరు. స్వాహాకారములు బిగ్గరగ చేయుచు, బాగుగ పలికినామని గర్వ పడుదురే గాని ఆ స్వాహాకార రూపమున అవతరించి, హవిస్సును గొను ఈశ్వరుని దర్శింపరు.
మంత్రములు అనుదాత్త, ఉదాత్త స్వరములతో చక్కగ పలుకు చున్నామనే అహంభావముతో చేతులు, తలలు, మెడలు త్రిప్పుదురే గాని మంత్ర రూపమున నున్న ఈశ్వరుని గమనింపరు. హోమ ద్రవ్యముల రూపమున, ఆవునేయి రూపమున యున్న ఈశ్వరుని దర్శింపక, వానిని హోమ ద్రవ్యములు గను, నేయిగను గుర్తింతురు. అంతేకాదు, ఊర్ధ్వ ముఖముగ అగ్ని జ్వాలలు అనేక కాంతులతో ప్రజ్వరిల్లు చున్నపుడు అందీశ్వరుని దర్శింపరు. హుతమగుచున్న ద్రవ్యము దృశ్యలోకము నుండి అదృశ్య లోకము లోనికి ఉద్ధరింపబడుట చూడరు. అట్టి ఉద్ధారణ రూపమున గూడ ఈశ్వరుడే యున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
07 Dec 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment