మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 115
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 115 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. జ్ఞానులు- దైత్యులు - 3 🌻
దైత్యులకు తమ ఆస్తిపై గాని, తమకు ఇష్టమున్న వారిపై గాని, తాము నమ్మిన దేవునిపై గాని, హోదాలపై గాని వీరి జీవిత సౌఖ్యము ఆధారపడి యుండును. దైవమును నమ్మితిమి అనుకొన్నను తాను కోరినది ఇచ్చువాడే దైవము గాని తన కన్నా దైవమునకు ఎక్కువ తెలియును అను నమ్మకముండదు. వీరందరు గూడ వేద శాస్ర్తాదుల యందు పాండిత్యము వహించి ఉందురు. కాని వీరి దృష్టిలో వేదమనగా కొన్ని విధి నిషేధ వాక్యముల గ్రంథము. దానితో ఎవరి వేదము వారికి ఉండును. ఎవరి వేదము నిజమైనది? అను సమస్య తీరదు. అంతర్యామి సాధన చేయువారికిని వేదమున్నది. వారికి ఈ సృష్టియే గ్రంథము. అందలి ప్రకృతి ధర్మములే శాస్త్రములు.
జీవరాసుల రూపములే దేవుని సజీవ విగ్రహములు. కష్ట సుఖములు ఆయా వ్యక్తులు చేసిన పనుల ఫలితములుగా అనుభవములు అగుచుండునే గాని దేవుడు కావలెనని కల్పించినవి కావు. ఈ రెండు తెగలవారు నరజాతి ఆవిర్భావము నుండి ఉన్నారు. రజస్తమస్సులు ప్రాధాన్యము వహించి పనిచేయుచున్నంత వరకు నరులు దైత్యజాతికి చెందిన జన్మలు అనుభవింతురు. సత్త్వగుణమున స్థిరత్వము కలిగిన నాటి నుండి దివ్యులు లేక ముముక్షువుల జన్మలు అనుభవింతురు....
....✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
07 Dec 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment