నిర్మల ధ్యానాలు - ఓషో - 111



🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 111 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. చర్య నీ చుట్టు దుమ్ము నింపుతుంది. కాబట్టి సమస్త చర్యని వదిలి పెట్టు. కనీసం రోజుకి కొన్ని గంటలు ధ్యానం లోలోతుల్లోని విశ్రాంతి కేంద్రానికి వెళుతుందన్న స్పృహతో చేయాలి. ధ్యానం ఏకాగ్రత కాదు. దానికి భిన్నంగా విశ్రాంతి పొందడం. 🍀

వ్యక్తి ధ్యానం పట్ల ఉల్లాసంగా వుండాలి. ఆట లాగా చూడాలి. అందులోని ఉల్లాసాన్ని ఆస్వాదించాలి. దాన్ని గురించి సీరియస్ గా వుండకూడదు. సీరియస్ గా వుంటే దాన్ని చేజార్చుకుంటుంది. ఆనందంగా దాన్ని సమీపించాలి. అది లోలోతుల్లోని విశ్రాంతి కేంద్రానికి వెళుతుందన్న స్పృహతో వుండాలి. అది ఏకాగ్రత కాదు. దానికి భిన్నంగా విశ్రాంతి పొందడం. ఎప్పుడయితే మొట్ట మొదటిసారి నువ్వు విశ్రాంతి పొందుతావో నువ్వు యథార్థంతో ముఖాముఖీగా వుంటావు. నీ అస్తిత్వంతో నువ్వు ఎదురెదురుగా వుంటావు. నువ్వు పనిలో పడి పరిగెడుతూ వుంటే నిన్ను నువ్వు చూడలేవు.

చర్య నీ చుట్టు దుమ్ము నింపుతుంది. కాబట్టి సమస్త చర్యని వదిలి పెట్టు. కనీసం రోజుకి కొన్ని గంటలు. అది ఆరంభంలో మాత్రమే. నువ్వు విశ్రాంతి పొందే కళని అభ్యసిస్తే అప్పుడు నువ్వు పని చేస్తూనే విశ్రాంతిగా వుంటావు. విశ్రాంతి అన్నది లోపలి విషయమని బాహ్య విషయాలతో అది ఆటంకాలకు లోను కాదని తెలుస్తుంది. ఉపరితలంలోని చర్యతో కేంద్రంలో వున్న నీ విశ్రాంతికి యిబ్బంది వుండదు. యిది ఆరంభకులకు మాత్రమే. అభ్యసించాకా అప్పుడు సమస్య వుండదు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


18 Dec 2021

No comments:

Post a Comment