మైత్రేయ మహర్షి బోధనలు - 44
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 44 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 32. లోదారి 🌻
దైవ ప్రార్థనలు, దైవారాధనలు సాధకులకు మనోవికాసము కల్గించి చైతన్యవంతుని చేయవలెను. అట్టి ప్రార్థనలే నిజమైన ప్రార్థనలు, ఇతరములు యాంత్రికములు. వాని వలన సమయము, శక్తి, వనరులు వృధా యగుట జరుగును. ప్రతి ప్రార్థనయూ మనలను దైవమును దరిజేరు మార్గమున ముందుకు గొని పోవలెను. నిత్యమూ ప్రార్థనలాచరించు వానికి, ప్రార్థనలు వినియోగపడుచున్నావా? లేవా? అని తెలియ వలెనన్నచో, ప్రార్థన చేయువారు, వారి భాషణము లను, ప్రవర్తననూ, వ్యవహారములనూ గమనించినచో తెలియనగును.
వాక్కునందు, చేతనయందు ఎక్కువ సౌశీల్యము కలుగు చుండినచో ప్రార్ధన సఫలము. అట్టి ప్రార్ధన వలననే చైతన్యము ద్విగుణీకృతము కాగలదు. దైవ ప్రార్థనము, ధర్మాచరణముల యందు క్రమశః అభివృద్ధి చెందు జీవునకు తప్పక మా పరంపరలోని వారు చేరువై ప్రోత్సహించి, దివ్య ప్రణాళిక యందు వారికి ప్రవేశము కల్గించు చుందురు. మేము ఎల్లప్పుడూ మిమ్ము కోరునది- “మీ యందలి దైవమును మీరు దరిజేరుట, ధర్మమును ప్రపంచమున నిర్వర్తించుటయే కానీ, మమ్ము ప్రార్థించుట కాదు. మీ దైవ ప్రార్థనము, ధర్మాచరణము కారణముగా మేము మీ దరిజేరగలము. మీకు చేయూత నీయగలము. మిమ్ము మేము చేరుటకు, మీరు మాతో కలసి పనిచేయుటకు యిది ఒకటియే మార్గము. మరియొకటి లేదు.”
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
18 Dec 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment