శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 330 / Sri Lalitha Chaitanya Vijnanam - 330


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 330 / Sri Lalitha Chaitanya Vijnanam - 330 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 74. కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా ।
వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా ॥ 74 ॥ 🍀

🌻 330. 'కాదంబరీప్రియా' 🌻

కాదంబరి యందు ప్రీతి గలిగినది శ్రీమాత అని అర్థము. 'కాదంబరి' యనగా మరిగిన పాల మీద వేడి మీగడ. ఈ మీగడ అన్న శ్రీమాతకు ప్రీతి హెచ్చు. కాదంబరి పుష్పమన్న కూడ శ్రీమాతకు ప్రీతి హెచ్చు. శరత్ ఋతువు నందు ఈ పుష్పము పరిపూర్ణముగ కాదంబరి వృక్షమునందు వికసించగ ఆశ్వయుజమున ఏడు వర్షపు చినుకులు పుష్పములపైన, వృక్షముపైన, వృక్షము చుట్టూ పడినపుడు కాదంబరి వృక్షము పుష్పములు ఆహ్లాదకరమగు సువాసనలు వెదజల్లును. ఈ సుగంధము తన్మయ స్థితి కలిగించ గలదు. ఈ సుగంధ మనిన శ్రీమాతకు ప్రీతి ఎక్కువ. చందనము కన్న అధికమగు ప్రీతి కాదంబరి పుష్పగంధ మివ్వగలదు.

కాదంబరి పుష్పమునందు నడిబొడ్డున ఏర్పడు మకరందము తేనె వలె మధురముగ నుండి శ్రీమాత భక్తులకు తన్మయత్వ మిచ్చుటకు వినియోగపడును. ఈ తేనెను స్వీకరించుట శ్రీవిద్యా ఉపాసకులకు పరిపాటి. కారణము ఈ తేనె యందు శ్రీమాతకు మక్కువ ఎక్కువ. కాదంబరి పుష్పములను కుదువ పెట్టి వాని రసమును పిండి కొంతకాలము పవిత్రమగు పాత్రలలో నుంచి నపుడు ఆ రసము పులియును. అట్టి రసము సురాపానమువలె సాధకుని నాడీ మండలమును శాంత పరచును. కాదంబరీ పుష్పములను శ్రీమాత పూజకు వినియోగించుట శ్రేష్ఠము అని తెలియవలెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 330 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 74. Kalavati kalalapa kanta kadanbari priya
Varada vamanayana varunimadavihvala ॥ 74 ॥ 🌻


🌻 330. Kādambarī-priyā कादम्बरी-प्रिया (330) 🌻

Kādambara is spirituous liquor distilled from the flowers of the Cadamba. The rain water which collects in hollow places of the tree Nauclea Cadamba (botanical name) when the flowers are in perfection and impregnated with honey is known as Kādambarī. It is a type of intoxicating drink. It is one of the five ‘M’s that we have discussed under tantra sastra. In navāvarana pūja (ritual worship of Śrī cakra pūja) a special drink (viśeṣa arghya) is prepared and offered to the Goddess.

Generally special drink consists of components of these five M-s - madhya (wine) māmasa (meat) matsya (fish) maithuna (procreation) and mudrā (reckoning of fingers). This sort of worship is called left hand worship. To practice this, one needs to have a masterly guru. In general this practice is not ideal for regular worship and not encouraged. The Supreme Goddesses is known for Her liking for such intoxicating drinks. In reality this does not mean intoxicating drink; but it refers to the ambrosia that is generated when kuṇḍalinī reaches the sahasrāra.

Or it could also mean the devotion expressed by Her devotees and She gets intoxicated by such true devotion (refer nāma 118 bhakti-priyā). It is also interesting to note that there are other nāma-s in this Sahasranāma about Her liking for intoxication that convey different interpretations depending upon the context.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


18 Dec 2021

No comments:

Post a Comment