మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 112
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 112 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. నరకము 🌻
మనము చేయు పనిని అనుసరించి మనము అనుభవించు ఫలితముండును. అయినచో మంచి పనులు చెడ్డపనులు అను విభాగము ఎట్లు ఏర్పడునుచున్నది? తనకు గాని ఇతరులకు గాని దుఃఖానుభవము కలిగించు పనులు చెడ్డవి అని, సుఖము కలిగించు పనులు మంచివి అని నిర్ణయించుకొనవలెను.
ఇది ఎట్లు తెలియును? తెలియుటకే దుష్కర్మలకు దుఃఖము ఫలితముగా ప్రకృతి నిర్ణయించుచున్నది. కలిగిన దుఃఖము వలన జీవుడు ఆ పని మాని మంచి పని చేయుటకై యత్నించుటయే జీవితమున దుఃఖానుభవమునకు ప్రయోజనము. ఇట్లు అధర్మ బుద్ధి నుండి ధర్మ బుద్ధికి జీవుడు మరలుటకే దుఃఖము సృష్టింపబడినది. దానినే నరకమందురు.
.....✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
01 Dec 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment