శ్రీ శివ మహా పురాణము - 483
🌹 . శ్రీ శివ మహా పురాణము - 483 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 37
🌻. పెళ్ళి హడావుడి - 2 🌻
పాలు, నేయి మరియు పెరుగును దిగుడు బావుల వంటి పాత్రలలో నింపియుంచిరి. యవలు మొదలగు ధాన్యములు, వాటి పిండి, మిఠాయి (12), చేగోడీలు, స్వస్తికలు, ఇతర మధుర పదార్థములు గుట్టలుగా పోయబడెను. మరియు అమృతమువంటి చెరుకు రసము నూతుల రూపములో లభింపచేయబడెను (13).
తాజా నెయ్యి, ఆసవములు సమృద్ధిగా సరఫరా చేయబడెను. గొప్ప రుచిగల వివిధ రకముల అన్నము సమృద్ధముగా లభించుచుండెను (14). శివగణములకు, దేవతలకు అభీష్టములగు అనేకరకముల పచ్చళ్లు సిద్ధమయ్యెను. గొప్ప విలువైన అనేక వస్త్రములుసిద్ధముగా నుంచబడెను. అగ్నియందు శుద్ధి చేయబడిన వెండి బంగారములు భద్రపరుప బడెను (15).
ఆయన వివిధ మణులను, రత్నములను, బంగారమును, వెండిని, ఇతర ద్రవ్యములను యథావిధిగా సంపాదించి సిద్ధము చేసెను (16). మంగళ కార్యములను చేయవలసిన రోజున ఆయన ఆ కార్యములను మొదలు పెట్టించెను. పర్వతుని అంతః పురస్త్రీలు పార్వతికి స్నానాది సంస్కారములను చేయించిరి (17).
ఆ నగరములోని బ్రాహ్మణ స్త్రీలు తాము అలంకరించుకొని లోకాచారము ననుసరించి ఆనందముతో మంగళ కర్మల ననుష్ఠించిరి (18). హిమవంతుడు ఆనందముతో నిండిన మనస్సు గలవాడై మంగళకర్మలను, ఉత్సవమును ఆచారముననుసరించి చేయించెను (19).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
01 Dec 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment