🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 114 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. జ్ఞానులు- దైత్యులు - 2 🌻
ఇక రెండవ తరగతి వారి దృష్టిలో అంతర్యామికున్న ప్రాధాన్యము మిగిలిన అంశములకు లేదు. అంతర్యామి ఈ రూపముతో ఉండవలెనని వారు భగవంతుని ఆజ్ఞాపింపరు. ఈ వరములు ఇమ్మని ఇరుకున పెట్టరు. ఇంత తపస్సు, యోగ సాధన చేసితిని అని దేవునకు రశీదు చూపించి దబాయించరు. దానికి ఫలితముగా సుఖమను మాటకు నిజమైన అర్థమును వీరు అనుభవించు చుందురు. వీరిని జ్ఞానులు, ముముక్షువులు అని పెద్దలు వ్యవహరింతురు.
వేదము, శాస్త్రము, ప్రకృతి శక్తుల వినియోగము, ఆచారము, ధర్మము, విధి నిషేధములు దైత్యులకును, మోక్ష జనులకును గూడా ఉన్నవి. దైత్యులలో తమ శాస్ర్తాదులకు తామే ప్రమాణము. సుఖము అను మాటకు తాము అనుకున్న అర్థమే తమకు ప్రమాణము. తత్ఫలితముగా సుఖమునకై శ్రమపడుట, సుఖము సాధింప యత్నించుచు కష్ట నష్టముల పాలగుట జరుగుచున్నది.
వీరి జీవితమునందు స్వేచ్ఛ ఉండదు. ఇతరుల అభిప్రాయములను అనుసరించి పట్టుదలతోనో, అంగీకారముతోనో బ్రదకవలసి యుండును. తమ జీవితానుభవమునకు ఇతరులే నాయకులు. తాము ఇతరుల జీవితములకు, పద్ధతులకు నాయకులు. అనగా ఇతరుల మంచి చెడ్డలను గూర్చి తమకు గట్టి అభిప్రాయములు ఉండును. నిర్భీతి ఇట్టి వారి జీవితమునకు ఉండదు...
....✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
05 Dec 2021
No comments:
Post a Comment