🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 126 🌹


*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 126 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. లోకోద్ధరణము- వ్యక్తి ఉద్ధరణము-2 🌻* 

*తన వద్దకు వచ్చిన వారిపై ఉద్వేగపడుటతో, స్వస్థత చెడును. తన ద్వారా మేలు పొందదగువారు ఆ మేలు వారి కర్మఫలముగా దైవము విధించగా, వేరొకరిని చేరుదురు. ఇంతకును తేలినదేమనగా లోక హితార్ధ కర్మాచరణము తన ఉద్ధరణకే. దివ్యత్వమనెడి ప్రేమ సాగరమున చినుకే తాను. ఆ సాగరముగా తానగుటయే తన ఆచరణ యొక్క లక్ష్యము.*

*ఇతరులెల్లరు పవిత్రులు కావలెననియు, తానెట్లును పవిత్రుడనే కాన సుఖపడవలెను అని అనుకొనిన దానవుడు అగును. తాను పవిత్రుడుగావలెననియు, ఇతరులెల్లరు సుఖపడవలెననియు గోరువాడు దివ్యుడగును. ఇతరుల యందు రజస్తమో దోషములు వెదుకుట వలన, ఆ దోషములు తన యందు విజృంభించును. ఇతరుల యందు 'తనను' దర్శించి ప్రేమలో కరిగినపుడు పరమపవిత్రుడగును. శుద్ధ సత్వమయుడగును‌ అనుదినము ఇట్టి పవిత్రత వైపు సాగిపోవుటకై ఆత్మ శోధన సాధకుని కర్తవ్యము.*

....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

No comments:

Post a Comment