🌹. గీతోపనిషత్తు -298 🌹


*🌹. గీతోపనిషత్తు -298 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 18-4
 
*🍀 18-4. పరతత్వము - అతని వలననే నీ యందు తెలివి ప్రకాశించు చున్నది. నీ యందలి ప్రజా ప్రాణము లకు అతడే స్వామి. అంతకన్న సన్నిహితమగు మిత్రుడు మరొకడు లేడు. అతడే ప్రాణమిత్రుడు. అతడే ఆత్మబంధువు. బంధువుల యందు, మిత్రుల యందు కూడ అతడినే దర్శించు చుండవలెను. అతనితో పెనవేసుకొనుటయే బంధుత్వము. అతనితో మైత్రి చేయుటయే నిజమగు మిత్రత్వము. పరతత్త్వమే నిధానం. నివాసము కూడ. 🍀*

*గతి ర్బరా ప్రభు స్పాక్షీ నివాస శ్శరణం సుహృత్ |*
*ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజ మవ్యయమ్ II 18*

*తాత్పర్యము : నేనే సమస్త జీవులకు గతి (లక్ష్యము). సమస్తమును భరించువాడను నేనే. సమస్తమునకు ప్రభువును నేనే. సాక్షియు నేనే. అందరికి నివాస స్థానము నేనే. నీకు హితమొనర్చు వాడను నేనే. నేనే సృష్టి స్థితి లయములకు మూలము. శాశ్వతమగు బీజమును కూడ నేనే.*

*వివరణము : సుహృత్ : పరమాత్మ నీ హృదయమునకు హృదయము నీ వంటివాడు. నీ ప్రాణమునకు ప్రాణము వంటివాడు. నీ తెలివికి తెలివి. అతడే నీ యందు మిత్రుని వలె వసించు చున్నాడు. అతని వలననే నీ యందు ప్రాణము స్పందించు చున్నది. అతని వలననే నీ యందు తెలివి ప్రకాశించు చున్నది. నీ యందలి ప్రజా ప్రాణములకు అతడే స్వామి. అంతకన్న సన్నిహితమగు మిత్రుడు మరొకడు లేడు. అతడే ప్రాణమిత్రుడు. అతడే ఆత్మబంధువు. బంధువుల యందు, మిత్రుల యందు కూడ అతడినే దర్శించు చుండవలెను. అతనితో పెనవేసుకొనుటయే బంధుత్వము. అతనితో మైత్రి చేయుటయే నిజమగు మిత్రత్వము.*

*ప్రభవః, ప్రలయః, : పరతత్త్వమే నిధానం. నివాసము కూడ. అందుండియే సృష్టి ఉద్భవించి, వృద్ధి చెంది కాలానుసారము అందులోనికే లయమగు చుండును. సృష్టి స్థితి లయములకు మూలమై పరతత్త్య మున్నది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

No comments:

Post a Comment