29-DECEMBER-2021 బుధవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 29, మంగళవారం, డిసెంబర్ 2021 సౌమ్య వాసరే 
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 298 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 497🌹 
4) 🌹 వివేక చూడామణి - 174 / Viveka Chudamani - 174🌹
🌹 Viveka Chudamani - 174🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -126🌹  
6) 🌹 Osho Daily Meditations - 115 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 174 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 174 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*సౌమ్య వాసరే, 29, డిసెంబర్‌ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ ఉచ్ఛిష్టగణపతి ధ్యానం 🍀*

*నీలాబ్జదాడిమీవీణాశాలీ గుంజాక్ష సూత్రకమ్ |*
*దధదుచ్ఛిష్టనా మాయం గణేశః పాతుమేచకః ||*
*ప్రకాంతరేణ సారీయోనిరసా స్వాదలోలుపం కామమోహితమ్ || 8 ||*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: కృష్ణ దశమి 16:13:37 వరకు 
తదుపరి కృష్ణ ఏకాదశి
నక్షత్రం: స్వాతి 26:39:40 వరకు 
తదుపరి విశాఖ
యోగం: సుకర్మ 25:17:39 వరకు 
తదుపరి ధృతి
కరణం: విష్టి 16:07:38 వరకు
వర్జ్యం: 09:26:18 - 10:56:06
సూర్యోదయం: 06:44:55
సూర్యాస్తమయం: 17:51:12
వైదిక సూర్యోదయం: 06:48:49
వైదిక సూర్యాస్తమయం: 17:47:18
చంద్రోదయం: 01:51:04
చంద్రాస్తమయం: 13:48:13
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: తుల
దుర్ముహూర్తం: 11:55:51 - 12:40:16
రాహు కాలం: 12:18:04 - 13:41:21
గుళిక కాలం: 10:54:46 - 12:18:04
యమ గండం: 08:08:13 - 09:31:30
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:40
అమృత కాలం: 18:25:06 - 19:54:54
ధూమ్ర యోగం - కార్య భంగం, 
సొమ్ము నష్టం 26:39:40 వరకు 
తదుపరి ధాత్రి యోగం - కార్య జయం 
పండుగలు : లేవు.
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -298 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 18-4
 
*🍀 18-4. పరతత్వము - అతని వలననే నీ యందు తెలివి ప్రకాశించు చున్నది. నీ యందలి ప్రజా ప్రాణము లకు అతడే స్వామి. అంతకన్న సన్నిహితమగు మిత్రుడు మరొకడు లేడు. అతడే ప్రాణమిత్రుడు. అతడే ఆత్మబంధువు. బంధువుల యందు, మిత్రుల యందు కూడ అతడినే దర్శించు చుండవలెను. అతనితో పెనవేసుకొనుటయే బంధుత్వము. అతనితో మైత్రి చేయుటయే నిజమగు మిత్రత్వము. పరతత్త్వమే నిధానం. నివాసము కూడ. 🍀*

*గతి ర్బరా ప్రభు స్పాక్షీ నివాస శ్శరణం సుహృత్ |*
*ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజ మవ్యయమ్ II 18*

*తాత్పర్యము : నేనే సమస్త జీవులకు గతి (లక్ష్యము). సమస్తమును భరించువాడను నేనే. సమస్తమునకు ప్రభువును నేనే. సాక్షియు నేనే. అందరికి నివాస స్థానము నేనే. నీకు హితమొనర్చు వాడను నేనే. నేనే సృష్టి స్థితి లయములకు మూలము. శాశ్వతమగు బీజమును కూడ నేనే.*

*వివరణము : సుహృత్ : పరమాత్మ నీ హృదయమునకు హృదయము నీ వంటివాడు. నీ ప్రాణమునకు ప్రాణము వంటివాడు. నీ తెలివికి తెలివి. అతడే నీ యందు మిత్రుని వలె వసించు చున్నాడు. అతని వలననే నీ యందు ప్రాణము స్పందించు చున్నది. అతని వలననే నీ యందు తెలివి ప్రకాశించు చున్నది. నీ యందలి ప్రజా ప్రాణములకు అతడే స్వామి. అంతకన్న సన్నిహితమగు మిత్రుడు మరొకడు లేడు. అతడే ప్రాణమిత్రుడు. అతడే ఆత్మబంధువు. బంధువుల యందు, మిత్రుల యందు కూడ అతడినే దర్శించు చుండవలెను. అతనితో పెనవేసుకొనుటయే బంధుత్వము. అతనితో మైత్రి చేయుటయే నిజమగు మిత్రత్వము.*

*ప్రభవః, ప్రలయః, : పరతత్త్వమే నిధానం. నివాసము కూడ. అందుండియే సృష్టి ఉద్భవించి, వృద్ధి చెంది కాలానుసారము అందులోనికే లయమగు చుండును. సృష్టి స్థితి లయములకు మూలమై పరతత్త్య మున్నది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 496 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 40

*🌻. శివుని యాత్ర - 1 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను-

అపుడు శంభుడు నంది మొదలగు గణములనందరిని పిలిచి తనతో బాటు ఆనందముతో వివాహమునకు రమ్మని ఆజ్ఞాపించెను (1).

శివుడు ఇట్లు పలికెను-

కొద్ది గణముల నిచట ఉంచి మీరు కూడా నాతో బాటు మహోత్సవమును జరుపు కుంటూ హిమవంతుని నగరమునకు పయనించుడు (2).

బ్రహ్మ ఇట్లు పలికెను-

అపుడు శివునిచే ఆజ్ఞాపించబడిన గణనాయకులు ఆనందముతో తమ తమ సైన్యములను తీసుకొని బయట దేరిరి. నేనా వివరములను కొంత శ్రమపడి వర్ణించెదను (3). శంఖకర్ణుడను గణాధ్యక్షుడు కోటి గణములతో కూడి హిమవంతుని నగరమునకు శివునితో బాటు బయలు దేరెను (4). గొప్ప ఉత్సవమును చేయుచూ కేకరాక్షుడు పదికోట్లతో (5), విశాఖుడను గణనాయకుడు నాల్గు కోట్ల గణములతో, గణాధ్యక్షుడగు పారిజాతుడు తొమ్మిది కోట్ల గణములతో బయల్వెడలిరి (6). 

శ్రీమంతుడగు సర్వాంతకుడు అరవై, వికృతాననుడు అరవై, దుందుభుడను గణాధ్యక్షుడు ఎనిమిది కోట్ల గణములతో బయలు దేరిరి (7). ఓ మహర్షీ ! కపాలుడు గణాధ్యక్షుడు అయిదుకోట్లు, వీరుడగు సందారకుడు ఒక కోటి, కందుక కుండకులు ఒక్కొక్క కోటి విష్టంభుడను గణాధిపతి ఎనిమిది కోట్లు (8,9), పిప్పలుడను గణాధ్యక్షుడు వేయి కోట్లు గణములతో ఆనందముతో బయలు దేరిరి. ఓ మహర్షీ! వీరుడైన సంనాదకుడను గణాధ్యక్షుడు కూడ వెళ్లెను (10).

ఓ మహర్షీ! ఆవేశనుడనే గణనాయకుడు ఎనిమిది, మహాకేశుడనే గణపతి వేయి (11), కుండుడు పన్నెండు, పర్వతకుడు పన్నెండు, వీరుడగు చంద్రతాపనుడు ఎనిమిది, కాల, కాలక, మహాకాల, అగ్నికులను గణానాయకులు కోటి చొప్పున (12, 13), అగ్నిముఖుడను గణనాయకుడు కోటి, ఆదిత్య మూర్ధుడు, మరియు ఘనావహుడు కోటి గణములతో నడిచిరి (14).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 174 / Viveka Chudamani - 174 🌹*
*✍️ రచన : పేర్నేటి గంగాధర రావు*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -21 🍀*

*566. పాలను పాలతో కలిపినపుడు; అలానే నీటిని నీటితో కలిపినపుడు అవి వాటిలో కలసి ఒకటవుతాయి. అలానే యోగి ఆత్మను తెలుసుకొని తాను ఆత్మగా (బ్రహ్మముగా) మారిపోతాడు.*

*567. ఈ విధముగా బ్రహ్మాన్ని దర్శించి బ్రహ్మముగా మారినపుడు, తన యొక్క ఇతర అసత్య పదార్థములన్ని మాయమై బ్రహ్మములో లీనమవుతాయి. యోగి బ్రహ్మమును తెలుసుకొన్న తరువాత మరల ఏ మాత్రము మార్పులతో కూడిన జీవితమును అనుభవించడు.*

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 174 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 32. I am the one who knows Brahman -21 🌻*

*566. As milk poured into milk, oil into oil, and water into water, becomes united and one with it, so the sage who has realised the Atman becomes one in the Atman.*

*(This verse was translated by Swami Turiyananda, a direct disciple of Sri Ramakrishna.)*

*567. Realising thus the extreme isolation that comes of disembodiedness, and becoming eternally identified with the Absolute Reality, Brahman, the sage no longer suffers transmigration.*

*Continues....*
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 174 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 32. I am the one who knows Brahman -21 🌻*

*566. As milk poured into milk, oil into oil, and water into water, becomes united and one with it, so the sage who has realised the Atman becomes one in the Atman.*

*(This verse was translated by Swami Turiyananda, a direct disciple of Sri Ramakrishna.)*

*567. Realising thus the extreme isolation that comes of disembodiedness, and becoming eternally identified with the Absolute Reality, Brahman, the sage no longer suffers transmigration.*

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 126 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. లోకోద్ధరణము- వ్యక్తి ఉద్ధరణము-2 🌻* 

*తన వద్దకు వచ్చిన వారిపై ఉద్వేగపడుటతో, స్వస్థత చెడును. తన ద్వారా మేలు పొందదగువారు ఆ మేలు వారి కర్మఫలముగా దైవము విధించగా, వేరొకరిని చేరుదురు. ఇంతకును తేలినదేమనగా లోక హితార్ధ కర్మాచరణము తన ఉద్ధరణకే. దివ్యత్వమనెడి ప్రేమ సాగరమున చినుకే తాను. ఆ సాగరముగా తానగుటయే తన ఆచరణ యొక్క లక్ష్యము.*

*ఇతరులెల్లరు పవిత్రులు కావలెననియు, తానెట్లును పవిత్రుడనే కాన సుఖపడవలెను అని అనుకొనిన దానవుడు అగును. తాను పవిత్రుడుగావలెననియు, ఇతరులెల్లరు సుఖపడవలెననియు గోరువాడు దివ్యుడగును. ఇతరుల యందు రజస్తమో దోషములు వెదుకుట వలన, ఆ దోషములు తన యందు విజృంభించును. ఇతరుల యందు 'తనను' దర్శించి ప్రేమలో కరిగినపుడు పరమపవిత్రుడగును. శుద్ధ సత్వమయుడగును‌ అనుదినము ఇట్టి పవిత్రత వైపు సాగిపోవుటకై ఆత్మ శోధన సాధకుని కర్తవ్యము.*

....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 115 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 115. UNDERSTANDING 🍀*

*🕉 The basic problem of why you are here will disappear only when you have reached to the very core of your being, never before. 🕉*
 
*Unless you meditate deeply, understanding will not arise. nobody else can give it to you; you have to earn it. Through arduous effort, struggle, sacrifice, you have to earn it, only then problems will disappear. The basic problem of why you are here will disappear only when you have reached to the very core of your being, never before. At the core you will know that you have always been here. It is not a question of why you are here. You have always been here in different forms. The form has been changing, but you have always been here. The form will go on changing but you will always remain here.*

*You are part of this whole. The river falls into the ocean, and again the ocean rises and becomes clouds. Again it becomes a river and falls into the ocean, then becomes clouds again. It goes on ... it is a wheel. You have been here many times. You will be here many times. In fact you have been here for eternity, and you will be here for eternity. There is no beginning and no end to existence: It is eternal. I can say that to you, but it will not bring understanding. When you go deep within yourself and you open the innermost shrine of your being, when you enter into that shrine, suddenly you will realize that you have always been here.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 174 / Sri Lalita Sahasranamavali - Meaning - 174 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 174. వ్యోమకేశీ, విమానస్థా, వజ్రిణీ, వామకేశ్వరీ ।*
*పంచయజ్ఞప్రియా, పంచప్రేత మంచాధిశాయినీ ॥ 174 ॥ 🍀*

🍀 941. వ్యోమకెశే : 
అంతరిక్షమే కేశముగా కలది

🍀 942. విమానస్థా : 
విమానము (సహస్రారము) నందు ఉండునది

🍀 943. వజ్రిణీ : 
వజ్రము ఆయుధముగా కలిగినది

🍀 944. వామకేశ్వరీ : 
వామకేశ్వరుని శక్తి

🍀 945. పంచయఙ్ఞప్రియా : 
నిత్యము చేయు పంచయఙ్ఞములచే ప్రీతి చెందునది

🍀 946. పంచప్రేతమంచాధిశాయినీ :
 పంచప్రేతములచే ఏరడిన మంచముపై కూర్చుని ఉండునది. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 174 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 174. Vyomakeshi vimanasdha vajrini vamakeshvari*
*Panchayagyna priya panchapreta manchadhishaeini ॥ 174 ॥ 🌻*

🌻 941 ) Vyoma kesi -   
She who is the wife of Shiva who has sky as his hair

🌻 942 ) Vimanastha -   
She who is at the top

🌻 943 ) Vajrini -   
She who has indra’s wife as a part

🌻 944 ) Vamakeshwaree -   
She who is goddess of the people who follow the left path

🌻 945 ) Pancha yagna priya -   
She who likes the five sacrifices

🌻 946 ) Pancha pretha manchadhi sayini -   
She who sleeps on the cot made of five corpses

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామములు #LalithaSahasranamam
 #PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/  
https://t.me/ChaitanyaVijnanam 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment