శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 327 / Sri Lalitha Chaitanya Vijnanam - 327


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 327 / Sri Lalitha Chaitanya Vijnanam - 327 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమ ప్రియా ।
కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀

🌻 327. 'కళావతి'🌻

అరువది నాలుగు కళలు గలది శ్రీమాత అని అర్థము. అరువది నాలుగు కళలు గూడిననేగాని కళావతి అని పిలుచుటకు సాధ్యపడదు. సృష్టియందు శ్రీమాత, శ్రీకృష్ణుడు మాత్రమే అట్టివారు. ఈ అరువది నాలుగు కళలను గూర్చి 'చతుషష్టి కళామయీ' అను నామమున వివరించుట జరిగినది. (రెండువందల ముప్పది ఆరవ నామము - 236)

శ్రీమాత తత్త్వము అరువది నాలుగు కళల మయమని అర్థము. కళలనగా కాంతులు. శ్రీమాత కాంతులు అరువది నాలుగు. ఆమెకు జరుపు ఆరాధనము అరువది నాలుగు ఉపచారములతో కూడి యున్నది. ఈ ఉపచారములు నేర్చుటకు అరువది నాలుగు విద్యలున్నవి. ఈ విద్యలన్నియూ కలవాడు పూర్ణ పురుషుడే. శ్రీకృష్ణుడు అన్ని విద్యలను ప్రదర్శించి చూపెను. ధర్మరాజాదులు, భీష్మ ద్రోణాదులు, ఇతర మహావీరులు, యిందలి కొన్ని విద్యలే యెరిగి యున్నారు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 327 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya
Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻

🌻 327. Kalāvatī कलावती (327) 🌻

She has sixty four types of arts or She is the possessor of these sixty four types of arts, which have been already discussed in nāma 236 and the interpretation is reproduced here. (She is the embodiment of sixty four types of arts. Kalā means art. There are sixty four types of arts in tantra śāstra-s. No concrete evidence is available either to confirm or dispute these sixty four arts (arts can be explained as either science or art or doctrine. They are all in the form of dialogue between Śiva and His consort Pārvatī. But, these sixty four types of arts originate from aṣṭama siddhi-s (the eight super human powers). Śiva himself tells Pārvatī about these sixty four arts.

Saundarya Laharī verse 31 says, “catuḥ-ṣaṣṭyā tantraiḥ sakalm” meaning that the sixty four tantra-s constitute everything. The sixty four tantra-s originate from the Pañcadaśī mantra and culminate in the Pañcadaśī mantra. This is evident from the fact that the same Saundarya Laharī verse says ‘idam te tantraṃ’ possibly meaning the Pañcadaśī mantra that is declared in the next verse of Saundarya Laharī. Since there is no differentiation between Her and the Pañcadaśī mantra, She is said to be in the form of all the sixty four types of tantric arts. These sixty four types of tantric arts are declared to the world by Śiva at the instance of His consort. The difference between nāma-s 236 and 327 is very subtle. The former says that She is in the form of these sixty four fine arts and this nāma says that She has these sixty four types of arts. The difference is between possession and reflection or prākaśa (Self illuminating) and vimarśa (reflecting).


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


10 Dec 2021

No comments:

Post a Comment