మైత్రేయ మహర్షి బోధనలు - 40


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 40 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 28. నిజమైన సాధువు - 2 🌻

శాస్త్రజ్ఞుని మనోతత్వము దేశ, కాల, మత, ఆచారములందు బందీ యగుటచే పారదర్శకములగు శాస్త్ర సిద్ధాంతములు వెలుగునకు వచ్చుట లేదు. చంద్రునిపై జీవము లేదని ఒకప్పుడు, ఉన్నదని మరియొ కప్పుడు, కుజునిపై జీవమున్నదని, లేదని, మరల ఉన్నదని శాస్త్రజ్ఞులు చెప్పుట హాస్యాస్పదము. మన సూర్యమండలమును దాటి మరొక సూర్యమండలమును నిరాకరించిన శాస్త్రము, యిపుడు మరియొక సూర్యమండలమును గుర్తించుచున్నది. మనకు తెలియనిది లేదనుట అజ్ఞానము.

మనకు తెలియనిది తెలియ వచ్చును. తెలియదు అని తెలియుట కూడా జ్ఞానమే. శాస్త్ర పరిశోధకుల యందుగల సాధువులు యిట్టి దురాచారములకు పాల్పడరు. వారే శాస్త్రజ్ఞానమును సమగ్రముగ అందివ్వగలరు. తత్వశాస్త్రము నైనను, విజ్ఞానశాస్త్రము నైనను, సాధువే చక్కగ నిర్వర్తించి జ్ఞానోదయ మేర్పరచ గలడు. సాధువు మానవజాతికి ధృవతార వంటి వాడు. కాషాయము ధరించిన ప్రతి వ్యక్తియు సాధువు కాడు. సశాస్త్రముగ వివరించు వాడు, శోధనా మార్గమున ప్రవేశపెట్టువాడు నిజమైన సాధువు.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


10 Dec 2021

No comments:

Post a Comment