నిర్మల ధ్యానాలు - ఓషో - 124


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 124 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ


🍀. మనుషులు వేల కొద్దీ యితర పనులు చేస్తూ వుంటారు. దు: ఖంలో పడి బాధ్యతని యితర్ల మీదకు తోస్తూ వుంటారు. సత్యమొక్కటే నీకు పరిష్కారం. ఎప్పుడు నువ్వు బాధల్లో వుంటే అప్పుడు ధ్యానంలో వెళ్ళు. నువ్వు సంపూర్ణ సాక్షీభూతంగా మారితే బాధ అదృశ్యమయి పోతుంది. 🍀

మనుషులు యింటికి తిరిగి రావడాన్ని వదిలిపెట్టు. వేల కొద్దీ యితర పనులు చేస్తూ వుంటారు. దు: ఖంలో పడి బాధ్యతని యితర్ల మీదకు తోస్తూ వుంటారు. భార్య యిబ్బంది పెడుతుంది. తను అందువల్లే బాధల్లో వున్నా ననుకుంటాడు భర్త. భార్య కాకుంటే సమాజం లేదా దేశం! దానికి సవాలక్ష సంగతులు సిద్ధంగా వుంటాయి. మనిషికి నింద మోపడానికి లెక్కలేనన్ని సిద్ధంగా వుంటాయి. లేకుంటే వ్యక్తి వాటిని సృష్టిస్తాడు. అవి బాధల్ని కొనసాగిస్తాయి. పరిష్కారాల్నివ్వవు. మరిన్ని బాధల్ని తెస్తాయి. సత్యమొక్కటే నీకు పరిష్కారం. నిన్ను క్షమించేది అదే.

కానీ నువ్వు సత్యానికి బహుదూరంలో వున్నావు. కాబట్టి ఎప్పుడు నువ్వు బాధల్లో వుంటే అప్పుడు ధ్యానంలో వెళ్ళు. నిశ్శబ్దంగా మారు. నీ బాధల్ని పరిశీలించు. సాక్షిగా మారు. ఆ బాధలో కలిసిపోకు. నువ్వు పరిశీలించే కొద్దీ ఆ బాధ మెల్లమెల్లగా తరిగిపోతుంది. నువ్వు సంపూర్ణ సాక్షీభూతంగా మారితే బాధ అదృశ్యమయిపోతుంది. అసలాబాధ అక్కడ లేనట్లే వుంటుంది. దాని జాడలు కూడా కనిపించవు. ఆ బాధలో దాగున్న శక్తే నీ మీద పరవశంగా మారి వర్షిస్తుంది. నువ్వు నీ యింటికి తిరిగి వచ్చావు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


17 Jan 2022

No comments:

Post a Comment