🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 340 / Sri Lalitha Chaitanya Vijnanam - 340 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 75. విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ ।
విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ ॥ 75 ॥ 🍀
🌻 340. 'విలాసినీ' 🌻
విక్షేపశక్తి గలది శ్రీమాత అని అర్థము. శ్రీమాత విలాసిని శక్తి మహత్తర మహిమ కలది. విలాసమనగా రహస్య గమనము. శ్రీమాత గమనము అనూహ్యము. జరిగిన వెనుకనే మహాత్ములైనా తెలియగలరు. జరిగిన పిదప ఇట్లు జరిగినదని సంభ్రమాశ్చర్యములతో వివరించుకొనుటయే గాని, ఇట్లు జరుగ గలదని ఎవ్వరునూ ఊహించలేరు. శ్రీమాత విలాసినీ శక్తి క్షణకాలమున జీవునికి ముక్తి నివ్వగలదు. ఆమె తలచినచో ఎట్టివారినైనా అద్భుతముగ ఉద్దరించగలదు. కోట్లకొలది రుద్రుల శక్తి ఊహించగలిగినచో అది విలాసిని శక్తిగ పరిగణింపబడును.
శ్రీమాత విలాసిని శక్తి బ్రహ్మరంధ్రమున చరించుచు నుండును. ఆమె అనుగ్రహ విశేషముచే ఆమె విలాసముగ యోగులు ఊర్ధ్వ లోకముల నుండి అధోలోకములకు, అధోలోకముల నుండి ఊర్ధ్వ
లోకములకు సంచరించుచు సృష్టికార్యమును చక్కబెట్టుచు నుందురు. నారదాదులు, సనక సనందనాదులు, సప్త ఋషులు అట్టివారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 340 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 75. Vishvadhika vidavidya vindhyachala nivasini
Vidhatri vidajanani vishnu maya vilasini ॥ 75 ॥ 🌻
🌻 340. Vilāsinī विलासिनी (340) 🌻
Vilāsa means playful. One interpretation is that She is interested in fun, associated with lusty acts with Śiva. Possibly this could mean that such acts are not considered as sins, as projected. If such acts do not exist, where is the question of procreation? If no procreation is happening, one of the God’s acts, the creation itself will be in jeopardy. Even the ancient scriptures do not advocate abstaining from such acts. But, at the same time they do prescribe certain rigorous rules and regulations that are to be strictly adhered to.
Vilāsa also means the power of projection which is called vikṣepa śakti (power of projection, through which the projection of the world is possible). This is the true act of māyā, veiling the Ultimate Truth and projecting It is as something else, thereby causing illusion. This interpretation seems to be appropriate as this nāma follows the earlier nāma Viṣṇu-māyā’. When She is in the form Viṣṇu’s māyā, (Viṣṇu is all-pervading) naturally She causes illusion.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
17 Jan 2022
No comments:
Post a Comment