మైత్రేయ మహర్షి బోధనలు - 59


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 59 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 46. సూక్తులు 🌻


మూర్ఖునితో వాదింపకుము. బాధ్యత లేని వాని యందు మౌనము వహింపుము. నీ విచక్షణా జ్ఞానమును ఇతరుల అభిప్రాయములనే మేఘములతో మరగుపరచు కొనకుము. అవగాహన లేనివారితో దీర్ఘ సంభాషణములు చేయకుము. పై సూత్రములను పాటించినచో నీవు అవమానింపబడవు. పాండిత్యము ప్రదర్శించు వారి ఎడల నిశ్శబ్దమును పాటించుము. పాండిత్య ప్రకర్ష వెనుక గల, వారి ఆవేదనను అవగాహన చేసుకొనుటకు ప్రయత్నింపుము.

అతిగ మాట్లాడినవారి విషయమున కూడ, ఆ జీవుల ఆవేదనను గుర్తింపుము. వీరందరికిని కావలసిన దేదియోయుండి బైటికి మరియొకటి ఏదియో పలుకుచుందురు. జీవులను గుర్తించి, వారి నర్తనములను గమనించుట దైనందిన చర్యగ ఏర్పరచు కొనుము. ఎక్కువమంది లోతులేని బావివంటి వారే. లోతుగల బావుల యందు నీరు నిశ్చలముగ నుండును. అట్టి వారి సాన్నిధ్యమున నీవు కూడ అప్రయత్నముగ నిశ్చలుడవగుదువు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


17 Jan 2022

No comments:

Post a Comment