మైత్రేయ మహర్షి బోధనలు - 55


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 55 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 42. స్వయంకృతము 🌻

జీవితమున క్రమశిక్షణ ఎవరికీయవలెను? తనకు తానే ఇచ్చుకొన వలెను. దివ్య బోధనలు ఎందు కొఱుకు? తన కొఱకే కాని యితరుల కొఱకు కాదు. మోసమును, దగాను ఎట్లు ఎదుర్కొన వలెను? వాని నాకర్షించు తత్త్వము తనలోనే వున్నదని, అది ఆశ యని గుర్తించి నిర్మూలించుకొనవలెను. ఇతరులు తన యెడల కఠినముగ ఎందుకు ప్రవర్తించు చున్నారు?

తాను యితరుల యెడల ప్రవర్తించు తీరును బట్టి, గౌరవించిన వారు గౌరవింప బడుదురు. దూషించిన వారు దూషింపబడుదురు. ఇతరులను ఉద్దేశించి నీవేమి భావించినను, మాట్లాడినను, చేసినను- అదే తీరులో నిన్ను గూర్చిన భావన, భాషణము, చేత యుండును. ఇది సృష్టి శాస్త్రము. దీనిని మరువకుము. సమస్తమును సహించుటతో నవజీవనమునకు పునాది వేయుము. సహించుట, భరించుట, బాధ్యత వహించుట- తప్పక నీ పురోగతికి తోడ్పడగలవు.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


09 Jan 2022

No comments:

Post a Comment