నిర్మల ధ్యానాలు - ఓషో - 121
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 121 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ధ్యానమన్నది మొదట నిన్ను అన్ని ఆలోచనల్నీ, వదిలేయమంటుంది. ఎప్పుడయితే ఆలోచనల్ని, కోరికల్ని వదిలి పెడతావో అప్పుడు నీ అనుభవానికి వచ్చిన దేదీ నీ మనసుతో సంబంధమున్నది కాదు. 🍀
ధ్యాన దేవుడే నిజమైన దేవుడు. నిజమైన దేవుణ్ణి ఎవరూ సృష్టించరు. అతను ధ్యానం ద్వారా అనుభవానికి వస్తాడు. ఎందుకంటే ధ్యానమన్నది మొదట నిన్ను అన్ని ఆలోచనల్నీ, వదిలేయమంటుంది.
ఎప్పుడయితే ఆలోచనల్ని, కోరికల్ని వదిలి పెడతావో అప్పుడు నీ అనుభవానికి వచ్చిన దేదీ నీ మనసుతో సంబంధమున్నది కాదు. ఆరంభంలో మనసును పక్కన పెట్టాలి. అప్పుడు ఎవడూ ఏదీ సృష్టించాల్సిన పని వుండదు. కనిపెట్టాల్సిన పని లేదు. అది ఏదో అప్పుడే అనుభవానికి వస్తుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
09 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment