*🌹. గురుగోవింద్ సింగ్ జయంతి శుభాకాంక్షలు మిత్రులందరికీ 🌹*
*🌹. Guru Gobind Singh Jayanti Subhakankshalu to All. 🌹*
*Prasad Bharadwaj* 🙏
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 141 / Bhagavad-Gita - 141 - 3-22 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 538 / Vishnu Sahasranama Contemplation - 538 🌹
4) 🌹 DAILY WISDOM - 216🌹
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 55🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 121🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 336-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 336-2 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 09, జనవరి 2022*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. ద్వాదశ ఆదిత్య ధ్యాన శ్లోకాలు - 1 🍀*
*1. ధాతా –*
*ధాతా కృతస్థలీ హేతిర్వాసుకీ రథకృన్మునే |*
*పులస్త్యస్తుంబురురితి మధుమాసం నయంత్యమీ*
*ధాతా శుభస్య మే దాతా భూయో భూయోఽపి భూయసః |*
*రశ్మిజాలసమాశ్లిష్టః తమస్తోమవినాశనః*
🌻 🌻 🌻 🌻 🌻
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం,
హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: శుక్ల-సప్తమి 11:10:35 వరకు
తదుపరి శుక్ల-అష్టమి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 07:11:28
వరకు తదుపరి రేవతి
యోగం: పరిఘ 10:48:12 వరకు
తదుపరి శివ
కరణం: వణిజ 11:12:34 వరకు
సూర్యోదయం: 06:48:21
సూర్యాస్తమయం: 17:57:49
వైదిక సూర్యోదయం: 06:52:14
వైదిక సూర్యాస్తమయం: 17:53:59
చంద్రోదయం: 11:54:04
చంద్రాస్తమయం: 00:22:33
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: మీనం
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 16:28:34 - 17:13:12
రాహు కాలం: 16:34:09 - 17:57:49
గుళిక కాలం: 15:10:27 - 16:34:08
యమ గండం: 12:23:05 - 13:46:47
అభిజిత్ ముహూర్తం: 12:01 - 12:45
అమృత కాలం: 02:12:48 - 03:52:12
మరియు 27:44:00 - 40:48:40
స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం
07:11:28 వరకు తదుపరి వర్ధమాన
యోగం - ఉత్తమ ఫలం
పండుగలు : గురుగోవింద్ సింగ్ జయంతి,
Guru Gobind Singh Jayanti
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గురుగోవింద్ సింగ్ జయంతి శుభాకాంక్షలు మిత్రులందరికీ 🌹*
*🌹. Guru Gobind Singh Jayanti Subhakankshalu to All. 🌹*
*Prasad Bharadwaj* 🙏
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత -141 / Bhagavad-Gita - 141 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 22 🌴*
*22. న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన |*
*నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ||*
🌷. తాత్పర్యం :
*ఓ పార్థా! నాకు నిర్దేశింపబడిన కర్మము ముల్లోకములలో ఏదియును లేదు. నేను కోరునది కాని, పొందవలసిన కాని ఏదియును లేకున్నను విహితకర్మల యందు నేను నియుక్తుడనై యున్నాను.*
🌷. భాష్యము :
వేదవాజ్మయమునందు భగవానుడు ఈ విధముగా వర్ణింపబడినాడు.
తం ఈశ్వరాణాం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమం చ దైవతమ్ |
పతిం పతీనాం పరమం పరస్తాద్ విదామదేవం భువనేశమీడ్యమ్ ||
న తస్యకార్యం కరణం చ విద్యతే న తత్సమ శ్చాభ్యధికశ్చ దృశ్యతే |
పరాస్య శక్తి ర్వివిదైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబాలక్రియా చ ||
“భగవానుడు నియామకులందరికీ నియామకుడైనట్టివాడు. అతడు సమస్త లోలపాలకులలో అతిఘనుడైనవాడు. ప్రతియొక్కరు అతని ఆధీనములో నున్నవారే. జీవులందరి ఆ భగవానుడే వివిధ శక్తులను ప్రదానము కావించియున్నాడు. కనుక ఆ జీవులెన్నడును స్వతః ఘనులు కాజాలరు.
సమస్త దేవతలచే పూజింపబడు ఆ భగవానుడు నిర్దేశించు వారందరికి పరమ నిర్దేశకుడు. కావున అతడు సమస్త లోకపాలకులకు మరియు నియామకులకు అతీతుడైనట్టివాడు. అంతియేగాక వారందరిచే అతడు పూజనీయుడై యున్నాడు. అతని కన్నను ఘనుడెవ్వరును లేరు మరియు అతడే సర్వకారణములకు ఆదికారణుడై యున్నాడు.”
“ఆ భగవానుడు సాధారణ జీవుని దేహము వంటి దేహమును కలిగియుండడు. అతని దేహము మరియు ఆత్మలకు భేదము లేదు. పరంపురుషుడైన అతని ఇంద్రియములు దివ్యములు. అతని ఏ ఇంద్రియమైనను ఇతరేంద్రియ కార్యము చేయగల సామర్థ్యమును కలిగియుండును. కావున అతని కంటె ఘనుడు గాని లేడు. అతని శక్తులు అనేకములగుటచే అతని కర్మలన్నియును అప్రయత్నముగా సహరీతిలో నిర్వహింపబడుచుండును.” (శ్వేతాశ్వతరోపనిషత్తు 6.7-8).
భగవానుని యందు ప్రతిదియు సమగ్రముగాను మరియు సత్యముగాను నెలకొనియుండుట వలన అతడు నిర్వహింపవలసిన కర్మమేదియును లేదు.
ఫలము గోరువానికి మాత్రమే చేయవలసిన కర్మ యుండును. కాని ముల్లోకములయందు ఏదియును పొందవలసినది లేనివానికి నిక్కముగా ఎట్టి కర్మయు ఉండదు. అయినను శ్రీకృష్ణభగవానుడు క్షత్రియులకు నాయకుని రూపున కురుక్షేత్రరణరంగమున కార్యోన్ముఖుడయ్యెను. ఏలయన దీనులకు మరియు దుఃఖితులైనవారికి రక్షణము గూర్చుట క్షత్రియుల ధర్మమై యున్నది. తానూ శాస్త్రవిధులకు అతీతుడై యున్నను శాస్త్రములను భంగపరచు దేనినైనను శ్రీకృష్ణభగవానుడు ఒనరింపడు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 141 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 3 - Karma Yoga - 22 🌴*
*22. na me pārthāsti kartavyaṁ triṣu lokeṣu kiñcana*
*nānavāptam avāptavyaṁ varta eva ca karmaṇi*
🌷Translation :
*O son of Paṛthā, there is no work prescribed for Me within all the three planetary systems. Nor am I in want of anything, nor have I a need to obtain anything – and yet I am engaged in prescribed duties.*
🌷 Purport :
The Supreme Personality of Godhead is described in the Vedic literatures as follows:
tam īśvarāṇāṁ paramaṁ maheśvaraṁ
taṁ devatānāṁ paramaṁ ca daivatam
patiṁ patīnāṁ paramaṁ parastād
vidāma devaṁ bhuvaneśam īḍyam
na tasya kāryaṁ karaṇaṁ ca vidyate
na tat-samaś cābhyadhikaś ca dṛśyate
parāsya śaktir vividhaiva śrūyate
svābhāvikī jñāna-bala-kriyā ca
“The Supreme Lord is the controller of all other controllers, and He is the greatest of all the diverse planetary leaders. Everyone is under His control. All entities are delegated with particular power only by the Supreme Lord; they are not supreme themselves. He is also worshipable by all demigods and is the supreme director of all directors. Therefore, He is transcendental to all kinds of material leaders and controllers and is worshipable by all. There is no one greater than Him, and He is the supreme cause of all causes.
“He does not possess a bodily form like that of an ordinary living entity. There is no difference between His body and His soul. He is absolute. All His senses are transcendental. Any one of His senses can perform the action of any other sense. Therefore, no one is greater than Him or equal to Him. His potencies are multifarious, and thus His deeds are automatically performed as a natural sequence.” (Śvetāśvatara Upaniṣad 6.7–8)
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 538 / Vishnu Sahasranama Contemplation - 538 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 538. మహావరాహః, महावराहः, Mahāvarāhaḥ 🌻*
*ఓం మహావరాహాయ నమః | ॐ महावराहाय नमः | OM Mahāvarāhāya namaḥ*
మహావరాహః, महावराहः, Mahāvarāhaḥ
*మహాంశ్చాసౌ వరాహశ్చ మహావరాహ ఉచ్యతే *
*ఈతడు గొప్ప వరాహముగా రూపము ధరించినవాడు.*
:: పోతన భాగవతము పంచమ స్కంధము ::
క. ఉత్తర కురుభూములఁ దను, హత్తుకొని వరాహదేవుఁ డధిపతియైనన్
సత్తుగ భూసతి యతనిం, జిత్తములో నిలిపి పూజ సేయుచు నుండున్. (49)
క. ఆ వర్షమందులను బ్రజ, లా విపులవరాహమూర్తి ననవరతంబున్
సేవించి కొలిచి సంస్తుతిఁ, గావించుచుఁ గాంతు రంతఁ గైవల్యంబున్. (50)
*ఉత్తర కురువర్షానికి వరాహదేవుడు అధిపతి. అక్కడ భూదేవి వరాహదేవుడయిన శ్రీహరిని మనసులో నిలుపుకొని పూజలు చేస్తుంటుంది. ఆ ఉత్తర కురువర్షంలోని ప్రజలు వరాహమూర్తిని అనుదినమూ (ఈ క్రింది ఉపనిషద్ మంత్రముతో) సేవిస్తూ, సంభావిస్తూ, సంస్తుతులు గావిస్తూ మోక్షపదాన్ని చేరుకొంటారు.*
:: శ్రీమద్భాగవతే పఞ్చమ స్కన్ధే అష్టాదశోఽధ్యాయః ::
ఓం నమో భగవతే మన్త్రతత్త్వలిఙ్గాయ యజ్ఞక్రతవే మహాధ్వరావయవాయ మహాపురుషాయ నమః కర్మశుక్లాయ త్రియుగాయ నమస్తే ॥ 35 ॥
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 538 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 538. Mahāvarāhaḥ 🌻*
*OM Mahāvarāhāya namaḥ*
महांश्चासौ वराहश्च महावराह उच्यते
*Mahāṃścāsau varāhaśca mahāvarāha ucyate*
*He appeared in the form of a great Varāha or wild boar and hence He is called Mahāvarāhaḥ.*
:: श्रीमद्भागवते पञ्चम स्कन्धे अष्टादशोऽध्यायः ::
ॐ नमो भगवते मन्त्रतत्त्वलिङ्गाय यज्ञक्रतवे महाध्वरावयवाय महापुरुषाय नमः कर्मशुक्लाय त्रियुगाय नमस्ते ॥ ३५ ॥
Śrīmad Bhāgavata - Canto 5, Chapter 18
Oṃ namo bhagavate mantratattvaliṅgāya yajñakratave mahādhvarāvayavāya mahāpuruṣāya namaḥ karmaśuklāya triyugāya namaste. 35.
(Upanisadic mantra of the Supreme Lord in Varāha rūpa)
O Lord, we offer our respectful obeisances unto You as the gigantic person. Simply by chanting mantras, we shall be able to understand You fully. You are yajña, and You are the kratu. Therefore all the ritualistic ceremonies of sacrifice are part of Your transcendental body, and You are the only enjoyer of all sacrifices. Your form is composed of transcendental goodness. You are known as tri-yuga because in Kali-yuga You appeared as a concealed incarnation and because You always fully possess the three pairs of opulences.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी ।
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥
మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥
Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 216 🌹*
*🍀 📖 from Lessons on the Upanishads 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 3. There is No ‘Ungod' in this World 🌻*
*The whole universe of perception, the entire creation, may be said to be involved basically, at the root, in something which cannot be said to change. This is an adorable and most praiseworthy conclusion, and anything that is adorable is a worshipful something. These masters of the Vedas Samhitas, therefore, recognised a divinity in all things. There is a god behind every phenomenon, which is another way of saying there is an imperishable background behind every perishable phenomenon.*
*The sun rises in the east, the sun sets in the west; clouds gather, pour rain and then go; seasons change; something comes, something goes; we are born, we become old and we also go. Everything is changing, everywhere, even in the vast universe of astronomical calculation. But all this is only an indication, a pointer to an unrecognised fact of there being something which is an adorable background of the cosmos itself. And wonderfully, majestically and touchingly, we may say, these sages of the Veda Samhitas began to see a god everywhere. There is no ‘ungod' in this world, because every phenomenon must be conditioned, or determined, by something which is not a phenomenon itself.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#PrasadBhardwaj
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 55 🌹*
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻 42. స్వయంకృతము 🌻*
*జీవితమున క్రమశిక్షణ ఎవరికీయవలెను? తనకు తానే ఇచ్చుకొన వలెను. దివ్య బోధనలు ఎందు కొఱుకు? తన కొఱకే కాని యితరుల కొఱకు కాదు. మోసమును, దగాను ఎట్లు ఎదుర్కొన వలెను? వాని నాకర్షించు తత్త్వము తనలోనే వున్నదని, అది ఆశ యని గుర్తించి నిర్మూలించుకొనవలెను. ఇతరులు తన యెడల కఠినముగ ఎందుకు ప్రవర్తించు చున్నారు?*
*తాను యితరుల యెడల ప్రవర్తించు తీరును బట్టి, గౌరవించిన వారు గౌరవింప బడుదురు. దూషించిన వారు దూషింపబడుదురు. ఇతరులను ఉద్దేశించి నీవేమి భావించినను, మాట్లాడినను, చేసినను- అదే తీరులో నిన్ను గూర్చిన భావన, భాషణము, చేత యుండును. ఇది సృష్టి శాస్త్రము. దీనిని మరువకుము. సమస్తమును సహించుటతో నవజీవనమునకు పునాది వేయుము. సహించుట, భరించుట, బాధ్యత వహించుట- తప్పక నీ పురోగతికి తోడ్పడగలవు.*
*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 121 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. ధ్యానమన్నది మొదట నిన్ను అన్ని ఆలోచనల్నీ, వదిలేయమంటుంది. ఎప్పుడయితే ఆలోచనల్ని, కోరికల్ని వదిలి పెడతావో అప్పుడు నీ అనుభవానికి వచ్చిన దేదీ నీ మనసుతో సంబంధమున్నది కాదు. 🍀*
*ధ్యాన దేవుడే నిజమైన దేవుడు. నిజమైన దేవుణ్ణి ఎవరూ సృష్టించరు. అతను ధ్యానం ద్వారా అనుభవానికి వస్తాడు. ఎందుకంటే ధ్యానమన్నది మొదట నిన్ను అన్ని ఆలోచనల్నీ, వదిలేయమంటుంది.*
*ఎప్పుడయితే ఆలోచనల్ని, కోరికల్ని వదిలి పెడతావో అప్పుడు నీ అనుభవానికి వచ్చిన దేదీ నీ మనసుతో సంబంధమున్నది కాదు. ఆరంభంలో మనసును పక్కన పెట్టాలి. అప్పుడు ఎవడూ ఏదీ సృష్టించాల్సిన పని వుండదు. కనిపెట్టాల్సిన పని లేదు. అది ఏదో అప్పుడే అనుభవానికి వస్తుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 336-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 336 -2🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 75. విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ ।*
*విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ ॥ 75 ॥ 🍀*
*🌻 336-2. 'వింధ్యాచల నివాసినీ' 🌻*
మానవ ప్రజ్ఞ మణిపూరకమున నున్నప్పుడు మదము సహజముగ నుండును. ప్రజ్ఞ హృదయమును చేరినచో ఆనందము కలుగును. మణిపూరక పద్మములకు, హృదయ పద్మమునకు నడుమ గల ఉదర వితానమే వింధ్యాచలము. వింధ్యాచలమును అదుపున నుంచువారిలో శ్రీమాత, అగస్త్య మహర్షి ప్రధానమైనవారు. అగస్త్య మహర్షి కూడ శ్రీమాత ఆరాధకుడే. నందాదేవి శుంభ నిశుంభు లను రాక్షసులను సంహరించినది. వారు వైవస్వత మనువు అనుగ్రహముచే వరములు పొంది మదించిన వారై దేవతలకు కూడ ఉపద్రవము గలిగించ నారంభించిరి. వారిని నందాదేవి సంహరించినది.
మానవుల యందు దైవీ భావములు, ఆసురీ భావములు కలుగుచునే యుండును. ఆసురీ భావములు విజృంభించినపుడు దేహమందలి దేవతా ప్రజ్ఞలకు ఉపద్రవము కలుగును. మానవ ప్రజ్ఞ అతలాకుతల మగును. జీవిత సన్నివేశము లన్నియూ ప్రతికూల మగును. మనశ్శాంతి కరవగును. ఆందోళన, భయము ఇత్యాది మలినము లుద్భవించును. ఇట్టివారు నందాదేవిని గాని, ఆమె ప్రతి రూపమైన శ్రీకృష్ణుని గాని నిత్యము ఆరాధనము చేసుకొనవలెను.
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 336-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 75. Vishvadhika vidavidya vindhyachala nivasini*
*Vidhatri vidajanani vishnu maya vilasini ॥ 75 ॥ 🌻*
*🌻 336-2. Vindhyācala-nivāsinī विन्ध्याचल-निवासिनी (336) 🌻*
*She lives in Vindhyā mountains. In Durgā Saptasati (Seven hundred verses like Bhagavad Gīta and is a part of Mārkaṇḍeya Purāṇa) XI.41, She says “I will be born in the house of Nandagopa (father of Kṛṣṇa) and will live in Vindhyā mountains, during which time I will kill these two demons (two demons called Śumba and Niśumba)”.*
*This verse is a definite clue identifying Kṛṣṇa as Lalitāmbikā. This could be the reason for various nāma-s in this Sahasranāma identifying Her with Viṣṇu. There are certain instances where She is said to be the sister of Viṣṇu. In this Sahasranāma, nāma 280 says that She is the sister of Padmanābha, one of many names.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment