నిర్మల ధ్యానాలు - ఓషో - 134
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 134 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. వ్యక్తి కోరికని, దాని నిష్ఫలత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకోవడంలోనే కోరిక అదృశ్యమవుతుంది. వ్యక్తి తన శాంతి కేంద్రానికి చేరతాడు. కోరిక ఒకటే మన ఆందోళనకి కారణం. కోరిక అంటే ఉన్నదేదో దానిపట్ల అసంతృప్తి. యింకా కావాలనడం. కోరిక ఎప్పటికీ తీరదు. నువ్వు కోరికని సంతృప్తి పరచాలని ప్రయత్నిస్తే అది పైకి ఎగిరి యింకా యింకా కావాలంటుంది.🍀
మనం కోరికలో జీవిస్తాం. కోరిక అంటే అసంతృప్తి, కోరిక అంటే ఉన్నదేదో దానిపట్ల అసంతృప్తి. యింకా కావాలనడం. కోరిక ఎప్పటికీ తీరదు. దాని స్వభావాన్ని బట్టి అది అసంపూర్ణంగానే వుండిపోతుంది. నువ్వు కోరికని సంతృప్తి పరచాలని ప్రయత్నిస్తే అది పైకి ఎగిరి యింకా యింకా కావాలంటుంది. అసూయకు అవధులు లేవు. అది దిగంతం లాంటిది. దగ్గరగా వున్నట్లనిపిస్తుంది. పరిగెడితే గంటలో అందుకోగలనను కుంటావు. కానీ దాన్ని ఎప్పటికీ అందుకోలేవు. ఎంత వెళ్ళినా అది అంతే దూరంలో వుంటుంది. కారణం దిగంతమంటూ లేదు. అది భ్రాంతి. భూమి ఆకాశంలో కలవదు. అట్లా కనిపిస్తుంది. అంతే.
కోరిక విషయం కూడా అంతే. అది కూడా మనకు అందినట్లే వుంటుంది. ఏదో ఒక విధంగా దాన్ని అందుకోవచ్చని భావిస్తాం. అది తీరితే ఆనందంగా వుండవచ్చని, సంతృప్తిగా వుండవచ్చని అనుకుంటాం. కానీ అది జరగదు. వ్యక్తి కోరికని, దాని నిష్ఫలత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకోవడంలోనే కోరిక అదృశ్యమవుతుంది. వ్యక్తి తన శాంతి కేంద్రానికి చేరతాడు. కోరిక లేకుంటే ఆందోళన వుండదు. కోరిక ఒకటే ఆందోళన కారణం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
10 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment