నిర్మల ధ్యానాలు - ఓషో - 137


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 137 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ


🍀. మనిషిగా వుండడమన్నది గొప్ప వరం. మనిషిగా వుండడం వల్ల దేవుణ్ణి అందుకోవచ్చు. అది అందరికీ కాదు. చురుకయిన వాళ్ళకి, మేలుకున్న వాళ్ళకి మాత్రమే అది వీలవుతుంది. కొంత మంది మాత్రమే తమకు, దేవుడికి మధ్య వంతెన నిర్మించగలరు. వంతెన లేనిదే జీవితం అర్థరహితం. 🍀

మనిషిగా వుండడమన్నది గొప్ప వరం. ఆ విషయం కొంతమందికే తెలుసు నువ్వు ఈ అనంత విశ్వంలో ఏదయినా కావచ్చు. రాయి, కాబేజీ, ఆలుగడ్డ ఏదయినా కావచ్చు! అప్పీలు చేసుకోవడానికి అక్కడ ఎట్లాంటి కోర్టు లేదు. ఒకడు ఏదిగా వుంటే అదిగానే వుంటాడు. దాన్ని గురించి ఏమీ చెయ్యలేం. దాన్ని గురించి నోరులేని ఆలుగడ్డ ఏం చేస్తుంది. కానీ కొంతమంది తాము మనుషులమని, ఎదగడానికి తమకు అనంత అవకాశాలున్నాయని గుర్తిస్తారు. మనిషిగా వుండంలోని ఔన్నత్యమదే.

మనిషిగా వుండడం వల్ల దేవుణ్ణి అందుకోవచ్చు. అది ప్రాథమికంగా వుండాల్సిన లక్షణం. ఏ యితర జంతువూ దేవుణ్ణి సమీపించలేదు. మనిషికి మాత్రమే అది వీలవుతుంది. అది అందరికీ కాదు. చురుకయిన వాళ్ళకి, మేలుకున్న వాళ్ళకి మాత్రమే అది వీలవుతుంది. కొంత మంది మాత్రమే తమకు, దేవుడికి మధ్య వంతెన నిర్మించగలరు. వంతెన లేనిదే జీవితం అర్థరహితం. వంతెన లేకుంటే గొప్ప అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళవుతాం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


16 Feb 2022

No comments:

Post a Comment