మైత్రేయ మహర్షి బోధనలు - 74
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 74 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 60. గురుదక్షిణ 🌻
అంతః బహిః శుచికి పరమగురువు విలువ నిచ్చును. చిన్న చిన్న పదములలో గంభీరమగు సత్యములను తెలిపినచో పరమగురువు ఆనందించును. పదజాలముతో శ్రోతలను భ్రమింపజేయక సూటిగ అనుభవైక విషయమును బోధించిన పరమగురువు మెచ్చుకొనును. బోధనలు ఆచరణీయముగ నున్నచో మరింత సంతోషించును. బోధనను సత్యదూరము కాకుండ జాగ్రత్తపడినచో పరమ గురువు సహకరించును.
బోధన యందు తెలిపిన దానినే మరల మరల తెలుపుట తప్పనిసరి. విత్తనము మొలకెత్తుటకు, మొలకెత్తిన విత్తనము పెరుగుటకు మొక్క చుట్టును మరల మరల తోటమాలి త్రవ్వుచూ ఉండును గదా! నిశితము, నిశ్చయము, నిర్మమము యగు బోధన సద్గురువునకు యిచ్చు దక్షిణ యని తెలియుము.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
16 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment