శ్రీ మదగ్ని మహాపురాణము - 6 Sri Madagni Mahapuran - 6



🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 6 / Agni Maha Purana  - 6 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 2
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః  ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. మత్స్యావతార వర్ణనము - 1 🌻

వశిష్ఠుడు పలికెను: మత్స్యాదిరూపములను ధరించినవాడును, సృష్ట్యాదులకు కారణమైనవాడును అగు విష్ణువును గూర్చి చెప్పుము. పూర్వము విష్ణువునుండి వినిన విధమున అగ్నేయపురాణమును గూర్చియు, బ్రహ్మను గూర్చియు (లేతా అగ్నేయ పురాణరూప మగు వేదమును) చెప్పుము.

అగ్ని పలికెను  వసిష్ఠా! విష్ణువు ధరించిన మత్స్యావతారమును గూర్చి చెప్పదను; వినుము, అవతారములు ధరించుట దుష్టనాశము కొరకును, శిష్టపాలనముకొరకును జరుగుచుండను కదా?

ఓ మునీ! గడచిన కల్పము చివర బ్రహ్మ నిద్రించుట అను నిమిత్తముచే ప్రలయ మేర్పడెను. అపుడు భూలోకాదు లన్నియు సముద్రములో మునిగిపోయినవి. వైవన్వతమనుపు భక్తిముక్తుల నపేక్షించి తపస్సుచేసెను. ఒకనా డాతడు కృపతమాలా నదిలో జలతర్పణము చేయుచుండగా అతని దోసిలిలోని జలములో ఒక చిన్న చేపపిల్ల కనబడెను. ఆ రాజు దానిని నీటిలో పడవేయ దలచుచుండగా అది అతనితో - ''మహారాజా! నా కీ జలములో మొసళ్ళు మొదలగువాటినుండి భయ మున్నది. అందుచే దీనిలో పడవేయకుము" అని పలికెను. అది విని అతడు దానిని కలశములో ఉంచెను.

ఆ మత్యృము పెద్దదిగా అయి రాజుతో "నాకొక పెద్ద స్థానము నిమ్ము'' అని పలికెను. రా జా మాట విని దానిని చేదలో ఉంచెను. అచట పెద్దదై ఆ రాజుతో ఇట్లనెను : " ఓ! మనుచక్రవర్తీ! నాకు విశాలమైన స్థానము నిమ్ము." పిమ్మట దానిని సరస్సులో విడువగా అది ఆ సరస్సు ప్రమాణము వంటి ప్రమాణము గలదిగ పెరిగెను. "నా కింకను పెద్ద దైన స్థానము నిమ్ము" అని పలుకగా దాని నాతడు సముద్రములోనికి విడిచెను. అది క్షణమాత్రమున లక్ష యోజనముల ప్రమాణము గలదిగా పెరిగెను. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 6 🌹
✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

🌻 Chapter 2 - Manifestation of Viṣṇu as Fish - 1 🌻

Vasiṣṭha said:

1. O Brahmā! Describe unto me the manifestations of Viṣṇu, such as the Fish etc., which are the cause of creation. Also narrate to me the Agni-Purāṇa as heard from Viṣṇu in the days of yore.

Agni said:

2. O Vasiṣṭha! I shall describe to you the manifestation of Hari as a Fish. Listen. The manifestations are for the destruction of the wicked and for the protection of the pious.

3. At the end of the past kalpa (of 432 million years), there was a periodical dissolution. Brahmā was its instrumental cause. O sage! the earth and the people were submerged under the rising water.

4-5. Vaivasvata-Manu was practising penance for gaining objects of enjoyment and for release from mundane existence.

Once when he was offering waters of libation in the (river) Kṛtamālā, a small fish came in the waters in his folded palms. As he desired to throw it into the waters, it said “O excellent man! do not throw me away.

6. Now I have fear from the crocodiles (and others).” Having heard this (Vaivasvata Manu) put it into a vessel. When it had grown there in size, it requested him, “Get me a bigger vessel”.

7. Having heard these words, the king put the fish in a bigger vessel. Growing there again in size it requested the-king, “O Manu! Get me a bigger place”.

8. When it was put into a tank, it soon grew in size as big as it (the tank) and said, “Get me to a bigger place”. Then (Manu) put it into the ocean.

9. In a moment, it grew in size extending to a lakh of yojanas (one yojana 8 or 9 miles).

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


16 Feb 2022

No comments:

Post a Comment