నిర్మల ధ్యానాలు - ఓషో - 138


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 138 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. దేవుడిని భయంతో, ఈర్షతో, కోరికతో చేరడం నీ లక్ష్యం కాదు. దేవుడు ప్రేమతో అందుకోవాల్సిన అంతిమ ఆనందం. నిజమైన దారి ప్రేమ. దైవాన్ని గాఢంగా ప్రేమించు. నువ్వు దైవ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతావు. 🍀


దేవుడి కేసి ఎన్నో పొరపాటు మార్గాలున్నాయి. సరయిన మార్గం ఒకటే. పొరపాటు మార్గాల ఒకడు భయం గుండా దేవుణ్ణి సమీపించవచ్చు. తను తప్ప యితరులు వెళ్ళలేరని ఒకడు అనుకోవచ్చు. అందువల్ల అది పొరపాటు. నువ్వు భయంతో వుంటే దేవుణ్ణి ఎలా చేరుతావు! భయపడడమంటే పలాయనం. దాని వల్ల దేవుడికి మరింత దూరంగా జరగుతావు తప్ప దగ్గర ఎలా అవుతావు? కానీ మతాలన్నీ దేవుడి పట్ల భయాన్ని బోధించాయి. నిజమైన మతమున్న మనిషి దేవుడంటే భయపడకూడదు. దేవుణ్ణి ప్రేమించాలి. మనిషి ఈర్ష్యగుండా దేవుణ్ణి సమీపించవచ్చు. అది పొరపాటు మార్గం. ఈర్య అంటే వంచన.

నీకు ధనం కావాలి. అధికారం కావాలి, స్వర్గ సుఖాలు కావాలి. అవి దేవుడి ద్వారా అందాలి. అందువల్ల నువ్వు దేవుడికి లొంగుతావు. దేవుడిని భయంతో, ఈర్షతో, కోరికతో చేరడం నీ లక్ష్యం కాదు. దేవుడు మనిషి అందుకోవాల్సిన అంతిమ ఆనందం. అందువల్ల యిలాంటి వన్నీ పొరపాటు మార్గాలు. అవి దారుల్లా కనిపిస్తాయి కానీ దారులు కావు. గోడలు. నిజమైన దారి ప్రేమ. దైవాన్ని గాఢంగా ప్రేమించు. నీ చుట్టూ ఒక నవ్యమైనది అల్లుకుంటుంది. నువ్వు దైవ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతావు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


18 Feb 2022

No comments:

Post a Comment