మైత్రేయ మహర్షి బోధనలు - 75
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 75 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 61. అద్భుతము 🌻
ఇతరుల హృదయములను స్పృశించి రంజింప చేయుటకు, అట్టి రంజనము దీర్ఘకాలము నిలచుటకు వలసిన సామర్థ్యమొక్కటియే. అది నిరాడంబరత. నిరాడంబరుడికి సమస్తము లొంగును. అతని నుండి ఇంద్రధనుస్సువలె అతి సుందరమైన కార్యములు వ్యక్తము కాగలవు. అవి సూటిగ హృదయమును తాకి ప్రచోదన మొనర్పగలవు.
వ్యక్తిగత గుర్తింపునకు, సమాజపు గుర్తింపునకు పాటుపడువారు ఇంద్ర ధనుస్సువలె హృదయములను రంజింప చేయజాలరు. కేవలము భ్రమగొలిపి భ్రాంతి కలిగింతురు. భ్రమ, భ్రాంతి కారణముగ తాత్కాలికపు అద్భుతములు జరుగును. కాని నిర్మల కార్యము వలన అట్టి అద్భుతములు శాశ్వతముగ జరుగును. హృదయములను సన్మార్గమున మేల్కొల్పుటయే నిజమైన అద్భుతము.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
18 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment