నిర్మల ధ్యానాలు - ఓషో - 142


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 142 🌹

✍️. సౌభాగ్య

📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మిమ్మల్ని చుట్టు ముట్టిన అస్తిత్వ సౌందర్యాన్ని ప్రేమించ మంటాను. అదే నిజమైన ఆరాధన. దేవుడు వ్యాపించి వున్నాడు. వేయి మార్గాల గుండా అనుభవానికి వస్తాడు. నమ్మడం కన్నా అనుభూతి చెందడం అపురూపమైంది. అనంత విశ్వాన్ని, అంతులేని నక్షత్రాలతో ధగధగలాడే విశ్వాన్ని అనుభూతి చెందు. 🍀


పూజించే వాళ్ళు కోకొల్లలు. భక్తులు లెక్కలేనంత మంది. ప్రపంచం వాళ్ళతో నిండి వుంది. కానీ నేను వాళ్ళని భక్తులని అనను. వాళ్ళ భక్తి ఆచార కర్మకాండ. వాళ్ళు కేవలం సంప్రదాయాన్ని అనుసరిస్తారు. వాళ్ళు ప్రతీకల్ని మాత్రమే ఆరాధిస్తారు. వాళ్ళ హృదయాలు ప్రేమతో నిండి వుండవు. దేవుడి గురించి వాళ్ళు తపించరు. కేవలం ఒక సామాజిక బాధ్యతని నిర్వర్తిస్తారు. దానికి అలవాటు పడి వుంటారు. అది చెయ్యకుంటే ఏదో కోల్పోయినట్లు వాళ్ళు భావిస్తారు. నేను కేవలం మిమ్మల్ని చుట్టు ముట్టిన అస్తిత్వ సౌందర్యాన్ని ప్రేమించమంటాను.

అదే నిజమైన ఆరాధన. దేవుడు వ్యాపించి వున్నాడు. వేయి మార్గాల గుండా అనుభవానికి వస్తాడు. వృక్షాల ద్వారా, పూల గుండా, పక్షుల గుండా, పర్వతాల గుండా, సూర్యచంద్రాదుల గుండా, మనుషుల గుండా, జంతువుల గుండా ఆయన అనుభవానికి వస్తాడు. నమ్మడం కన్నా అనుభూతి చెందడం అపురూపమైంది. అనంత విశ్వాన్ని, అంతులేని నక్షత్రాలతో ధగధగలాడే విశ్వాన్ని అనుభూతి చెందు. మనోహరమై సూర్యాస్తమయం ముందు నువ్వు మోకాళ్ళ మీద కూచుని తలవంచి పరవశించకుంటే, కోకిల గానాన్ని విని పులకించకుంటే ఎట్లాంటి ఆరాధనలయినా నీకు నిష్ఫలం. హృదయం జీవన స్పందనల్ని వినిపించకుంటే భక్తి అన్నది అర్థం లేనిది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


26 Feb 2022

No comments:

Post a Comment