మైత్రేయ మహర్షి బోధనలు - 79
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 79 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 65. ఆశించుట, శ్రమించుట 🌻
ఆశించుటకు, శ్రమించుటకు భేదమున్నది. ఆశించుట ఎక్కువైనచో, శ్రమించుట తగ్గును. శ్రమించువాడు. ప్రస్తుతమున జీవించును. ఆశించువాడు ప్రస్తుతమును కోల్పోవుచునే యుండును. మరియు శ్రమించువాడు క్రమముగ ఆశయ సిద్ధిని పొందును.
కేవల మాశించు వాడు ఆశయములకు దూరమగు చుండును. శ్రమించక ఆశించుట వ్యర్థము. ఆశించిన దానికి శ్రమించుట ఔచిత్యము. శ్రమించుటలో ఆనందించుట ఉత్తమము. అట్టివారే కాలగమనమున సమర్థవంతులుగ తీర్చిదిద్ద బడుదురు.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
26 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment