శ్రీ మదగ్ని మహాపురాణము - 8 Sri Madagni Mahapuran - 8



🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 8 / Agni Maha Purana  - 8 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 3
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః  ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. కూర్మావతార వర్ణనము - 1 🌻

అగ్ని పలికెను: పాపములను తొలిగించు కూర్మావతారమునుగూర్చి మొదట నేను ప్రతిజ్ఞచేసినవిధమున చెప్పెదను. పూర్వము దేవాసురయుద్దములో దేవతలు దూర్వాసుని శాపముచే దైత్యుల చేతిలో ఓడిపోయిరి. అపుడు వారు (ఐశ్వర్య) లక్ష్మీరహితులై పోయిరి. క్షీరాబ్ధిపై ఉన్న విష్ణువును స్తుతించి ''మమ్ములను అసురులనుండి రక్షింపుము'' అని వేడికొనిరి.

శ్రీ మహావిష్ణువు బహ్మాది దేవతలతో ఇట్లనెను: ''సురలారా! క్షీరాబ్దిని మథించి అమృతమును లక్ష్మిని సంపాదించుటకై అసురులతో సంధి చేసికొనుడు. పని విడినపుడు శత్రువులతో కూడ సంధి చేసి కొనవలెను గదా ! అమృతము మీకే తక్కునట్లును, దానవులకు తక్కకుండు నట్లును చేసెదను. మందర పర్వతమును కవ్వముగ చేసి, వాసుకుని కవ్వపు త్రాడుగా చేసి, నా సాహాయ్యముతో క్షిరాబ్ధిని మధింపుడు. మాంద్యము వలదు.

విష్ణువు ఇట్లు పలుకగా దేవతలు దైత్యలతో ఒప్పందము చేసికొని క్షీరాబ్ధికి వచ్చి మథింప ప్రారంభించిరి. వాసుకి తోక వైపు దేవత లుండిరి. సర్పము విడచు నిట్టూర్పుల వేడికి బాధపడుచున్న దేవతలను హరి సేదదీర్చెను. సముద్రమును మథించు చుండగా ఆ పర్వతముక్రింద ఆధార మేదియు లేకపోవుటచే నీటిలో మునిగిపోయేను.

విష్ణువు కూర్మరూపమును ధరించి మందరపర్వతమును నిలబెట్టెను. మథింపబడుచున్న క్షీరాబ్ధినుండి హాలాహల విషము పుట్టెను. శివుడు ఆ విషమును కంఠమునందు ధరించెను. అందుచే అతడు నీలకంఠు డయ్యెను. పిమ్మట వారుణీదేవియు (సురయు), పారిజాతము కౌస్తుభము, గోవుల , దివ్యలగు అప్సరసలు పుట్టిరి. లక్ష్మీదేవి ఆవిర్భవించి విష్ణువును చేరినది. దేవత లందరును ఆమెను చూచుచు స్తోత్రము చేయుటచే శ్రీమంతులైరి. పిమ్మట ఆయుర్వేదమును తీసికొని వచ్చిన ధన్వంతరి రూపుడైన విష్ణువు అమృతపూర్ణ మగు కమండలువును చేత ధరించి ఆవిర్బవించెను. జంభుడు మొదలగు దైత్యులు ఆతని చేతినుండి అమృతమును గ్రహించి, సగము దేవతల కిచ్చి, వెళ్లిపోయిరి. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana  - 8 🌹
✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

🌻 Chapter 3 - Manifestation of Viṣṇu as a Tortoise -1🌻

Agni said:

1. I shall describe unto you (now) about the manifestation (of Viṣṇu) as a tortoise, by hearing which one’s sins will be destroyed. In days of yore the celestial gods were defeated by the demons in a battle between them.

2. On account of the curse of sage Durvāsas,[1] the celestials were deprived of all their prosperity. Then they praised Viṣṇu who was (reclining) in the milky ocean and said, “Protect us from the demons”.

3. Hari said to Brahmā and others, “You make a treaty of peace with the demons for churning the ocean for securing ambrosia.

4. In the interest of an important work even the enemies should be sought for union. I will make you get the ambrosia and not the demons.

5. Making the (Mount) Mandara as the churning rod and (the serpent) Vāsuki as the rope, you vigilantly churn the milky ocean with my help”.

6. Concluding an agreement with the demons as suggested by Viṣṇu, (the celestials) came to the milky ocean. The celestials began to churn the ocean (from that side) where the tail of the serpent was.

7. The celestials who were afflicted by the sighs of the serpent, were comforted by Hari (Viṣṇu). As the ocean was being churned the mountain being unsupported entered into the water.

8. Then Viṣṇu assumed the form of a tortoise and supported the (Mount) Mandara. From the milky ocean which was being churned, first came out the poison known as Hālāhala.

9. That poison being retained by Hara (Siva) in his neck, Śiva became (known to be) Nīlakaṇṭha (blue-necked). Then the goddess Vāruṇī (The female energy of the celestial god Varuṇa), the Pārijāta (tree) and the Kaustubha (gem) came out of the ocean.

10. Then came out the (celestial) kine and the nymphs. Then came out Lakṣmī, who became the consort of Hari (Viṣṇu). Beholding her and adoring her all the celestials regained their lost prosperity.

11. Then Dhanvantari, (a form of Viṣṇu) and founder of the (science of) Ayurveda rose up holding a water-pot full of ambrosia.

12. Taking the ambrosia from his hands the demons Jambha and others having given half of it to the celestials went away with the other half. Then Viṣṇu assumed the form of beautiful damsel.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

22 Feb 2022

No comments:

Post a Comment