2) 🌹. శ్రీమద్భగవద్గీత - 176 / Bhagavad-Gita - 176 - 4-14 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 575 / Vishnu Sahasranama Contemplation - 575🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 24 / Agni Maha Purana 24 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 254 / DAILY WISDOM - 254 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 155 🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 93 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*బృహస్పతి వాసరే, 24, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : శీతల సప్తమి, Sheetala Saptami 🌻*
*🍀. శ్రీ కల్కి స్తోత్రం - 9 🍀*
*9. మమ గృహం ప్రతి పుత్రనప్తృకం గజరథైర్ధ్వజైశ్చామరైర్ధనైః |*
*మణివరాసనం సత్కృతిం వినా తవ పదాబ్జయోః శోభయంతి కిమ్*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : భాద్యతను స్వయంగా నిర్ణయించుకుని, ఎవరు కలసి వచ్చినా రాకున్నా మీ దారిలో మీరు ముందుకు వెళ్లడం కూడా ఆధ్యాత్మికతయే. - మాస్టర్ ఆర్.కె.🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: కృష్ణ సప్తమి 24:11:16 వరకు
తదుపరి కృష్ణ అష్టమి
నక్షత్రం: జ్యేష్ఠ 17:30:43 వరకు
తదుపరి మూల
యోగం: సిధ్ధి 07:28:04 వరకు
తదుపరి వ్యతీపాత
కరణం: విష్టి 13:13:27 వరకు
వర్జ్యం: 00:09:38 - 01:40:06
మరియు 25:02:40 - 26:33:12
దుర్ముహూర్తం: 10:20:44 - 11:09:26
మరియు 15:12:56 - 16:01:38
రాహు కాలం: 13:53:48 - 15:25:07
గుళిక కాలం: 09:19:52 - 10:51:11
యమ గండం: 06:17:14 - 07:48:33
అభిజిత్ ముహూర్తం: 11:58 - 12:46
అమృత కాలం: 09:12:26 - 10:42:54
సూర్యోదయం: 06:17:14
సూర్యాస్తమయం: 18:27:44
చంద్రోదయం: 00:36:07
చంద్రాస్తమయం: 10:51:21
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
కాలదండ యోగం - మృత్యు భయం
17:30:43 వరకు తదుపరి ధూమ్ర యోగం
- కార్య భంగం, సొమ్ము నష్టం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 176 / Bhagavad-Gita - 176 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 14 🌴*
*14. న మాం కర్మాణి లిమ్పన్తి న మే కర్మఫలే స్పృహా |*
*ఇతి మాం యోభి జానాతి కర్మభిర్న స బధ్యతే*
🌷. తాత్పర్యం :
*నన్ను ఏ కర్మము ప్రభావితము చేయజాలదు; నేను యెట్టి కర్మఫలమును ఆశింపను. నన్ను గూర్చిన ఈ సత్యము నెరిగినవాడు సైతము కర్మఫలములచే బంధింపబడడు.*
🌻. భాష్యము :
దేశేములేనేడి రాజు తప్పుచేసెడి అవకాశములేదనియు లేదా రాజ్యాంగశాసనములకు అతడు అతీతుడై యుండుననియు పలికెడి భౌతికజగత్తుకు సంబంధించిన రాజ్యశసనములు కలవు. అదేవిధముగా భగవానుడు ఈ భౌతికజగత్తుకు సృష్టికర్తయైనప్పటికి అట్టి జగత్కర్మలచే ప్రభావితుడు కాడు. అతడు ఈ జగమును సృష్టించి దానికి పరముగా నిలిచియుండగా, ప్రకృతి వనరులపై ఆధిపత్యము వహించు స్వభావముతో జీవులు వివిధ కామ్యకర్మ ఫలము లందు బంధితులగుదురు.
ఉదాహరణమునకు ఒక సంస్థ యందలి పనివారి మంచి మరియు చెడుకర్మలకు వారే బాధ్యులు కాగలరుగాని సంస్థ యొక్క యజమాని కాదు. అదే విధముగా ఈ జగమునందు జీవులందరును తమ తమ ఇంద్రియభోగకర్మల యందు మగ్నులై యున్నారు. అట్టి కర్మలను భగవానుడేమియును నిర్దేశించి యుండలేదు. అయినను జీవులు భోగానుభవవృద్ధి కొరకు ఈ జగత్తు నందలి కర్మల యందు నియుక్తులై, మరణానంతరము స్వర్గలోకమును పొందవలెనని వాంచింతురు.
పూర్ణుడైనందున శ్రీకృష్ణభగవానుడు ఎన్నడును నామమాత్ర స్వర్గభోగములందు ఆకర్షణను కలిగియుండడు. వాస్తవమునాకు స్వర్గవాసులైన దేవతలందరును అతని సేవకులే. పనివారు వాంచించెడి తుచ్చ సౌఖ్యమును, ఆనందమును యజమాని ఎన్నడును కోరడు. కర్మలకు మరియు కర్మఫలములకు అతడు సర్వదా అతీతుడై యుండును. ఉదాహరణమునాకు భూమిపై ఉద్బవించు వృక్షజాలమునకు వర్షము కారణము కాకున్నను, వర్షము లేకుండా అవి వృద్ధి చెందు అవకాశము లేదు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 176 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 4 - Jnana Yoga - 14 🌴*
*14. na māṁ karmāṇi limpanti na me karma-phale spṛhā*
*iti māṁ yo ’bhijānāti karmabhir na sa badhyate*
🌷 Translation :
*There is no work that affects Me; nor do I aspire for the fruits of action. One who understands this truth about Me also does not become entangled in the fruitive reactions of work.*
🌹 Purport :
As there are constitutional laws in the material world stating that the king can do no wrong, or that the king is not subject to the state laws, similarly the Lord, although He is the creator of this material world, is not affected by the activities of the material world. He creates and remains aloof from the creation, whereas the living entities are entangled in the fruitive results of material activities because of their propensity for lording it over material resources. The proprietor of an establishment is not responsible for the right and wrong activities of the workers, but the workers are themselves responsible.
The living entities are engaged in their respective activities of sense gratification, and these activities are not ordained by the Lord. For advancement of sense gratification, the living entities are engaged in the work of this world, and they aspire to heavenly happiness after death. The Lord, being full in Himself, has no attraction for so-called heavenly happiness.
The heavenly demigods are only His engaged servants. The proprietor never desires the low-grade happiness such as the workers may desire. He is aloof from the material actions and reactions. For example, the rains are not responsible for different types of vegetation that appear on the earth, although without such rains there is no possibility of vegetative growth.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 575 / Vishnu Sahasranama Contemplation - 575🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 575. సామగః, सामगः, Sāmagaḥ 🌻*
*ఓం సామగాయ నమః | ॐ सामगाय नमः | OM Sāmagāya namaḥ*
*యస్సామ గాయతి హరిస్సామగ ఇతీర్యతే*
*పరమాత్మ విభూతియే అయిన సామవేదగానము చేయు సామవేదీయుడు సామగః.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 575🌹*
*📚. Prasad Bharadwaj*
*🌻575. Sāmagaḥ🌻*
*OM Sāmagāya namaḥ*
*यस्साम गायति हरिस्सामग इतीर्यते / Yassāma gāyati harissāmaga itīryate*
*The Sāmvedin who sings from Sāma Veda is also His opulence and hence He is Sāmagaḥ.*
:: श्रीमद्भागवते द्वादशस्कन्धे त्रयोदशोऽध्यायः ::
यं ब्रह्मा वरुनेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैः स्तवैर्
वेदैः सङ्गपदक्रमोपनिशदैर्गायन्ति यं सामगाः ।
ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो
यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः ॥ १ ॥
Śrīmad Bhāgavata - Canto 12, Chapter 13
Yaṃ brahmā varunendrarudramarutaḥ stunvanti divyaiḥ stavair
Vedaiḥ saṃgapadakramopaniśadairgāyanti yaṃ sāmagāḥ,
Dhyānāvasthitatadgatena manasā paśyanti yaṃ yogino
Yasyāntaṃ na viduḥ surāsuragaṇā devāya tasmai namaḥ. 1.
Unto that personality whom Brahma, Varuṇa, Indra, Rudra and the Maruts praise by chanting transcendental hymns and reciting the Vedas with all their corollaries, pada-kramas and Upanisads, to whom the chanters of the Sāma Veda always sing, whom the perfected yogis see within their minds after fixing themselves in trance and absorbing themselves within Him, and whose limit can never be found by any god or demon -- unto that Lord I offer my humble obeisances.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥
త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥
Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,Sannyāsakrcchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 24 / Agni Maha Purana - 24 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 9*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*🌻. సుందరకాండ వర్ణనము - 3 🌻*
శ్రీ రాముడు పలికెను _"నీవు సీతను ఎట్లు చూచితివి? ఆమె నాతో ఏమని చెప్పమన్నది? మన్మథాగ్నిలో పడి ఉన్న నన్ను సీతా కథా మృతముచే తడుపుము."
నారదుడు పలికెను. హనుమంతుడు రామునితో ఇట్లు పలికెను. " రామా! సముద్రము లంఘించి, సీతను చూచి, లంకను కాల్చి వచ్చినాను. సీత ఇచ్చిన మణిని తీసికొనుము. ఆ రావణుని సంహిరంచి సీతను పొందగలవు. దుఃఖింపకుము.
రాముడా మణిని గ్రహించి, సీతావిరహముచే దుఃఖితుడై ఏడ్చెను. "మణిని చూడగనే సీతను చూచినట్లున్నది. నన్ను సీతవద్దకు తీసికొని వెళ్ళుము. అమెను విడచి జీవింపజాలను" అని పలికెను. సుగ్రీవాదులు ఓదార్చిరి. పిమ్మట సముద్రతీరము చేరెను. "సీతను రామునకు ఇచ్చివేయుము" అని విభీషణుడు రావణునకు ఉపదేశింపగా ఆ దురాత్ముడు అతనిని అవమానించెను. అందుచేత విభీషణుడు అసహాయుడై రామునివద్దకు వెళ్ళెను.
రాముడు మిత్రుడైన విభీషణుని లంకారాజ్యమునందు అభిషిక్తుని చేసెను- మార్గమిమ్మని సముద్రుని ప్రార్థింపగా అతడు ఇవ్వలేదు. అపుడు బాణములచే భేదించెను. సముద్రుడు రాముని వద్దకు వచ్చి పలికెను.
సముద్రుడు పలికెనుః "నాపై నలునిచే సేతువు కట్టించి లంకకు వెళ్ళుము. నన్ను లోతైన వానినిగా పూర్వము చేసినది నీవేకదా"! వృక్షములు, శైలములు మొదలైన వాటితో నలుడు కట్టిన సేతువుపై రాముడు వానరులతో సముద్రమును దాటి నువేల పర్వతముపై నిలచి, లంకను చూచెను.
అగ్ని మహాపురాణములోని సుందరకాండ వర్ణనమను నవమాధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana -24 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *
*Chapter 9*
*🌻 Sundar Kand - 3 🌻*
23-25. Rāma also being happy asked. Māruti, “How Sītā was seen by you? And what (message) did she send for me? Sprinkle me who am tormented by the fire of passion, with the nectar of the story of Sītā.
Hanūmat said to Rāma (how) he had come after crossing the ocean and seeing Sītā, burning the city (of Laṅkā) and taking jewel from Sītā. "O Rāma! Do not worry. You will get back Sītā after having killed Rāvaṇa.”
26-28. Receiving that jewel Rāma being grief-stricken wept and said, “Having seen this jewel (I feel) I have seen my Janaki. (Sītā)! (You) take me (there). I cannot live without her.” Being consoled by Sugrīva and others (Rāma) reached the banks of ocean. Vibhīṣaṇa who was forsaken by his wicked brother Rāvaṇa for having advised him to return Sītā to Rāma, came there alone to Rāma.
29-31. Rāma anointed his friend Vibhiṣaṇa as the ruler of Laṅkā. He requested ocean for (making) a way. When he had not come, then he split the (ocean) with an arrow. And the (king of the) ocean who had appeared before Rāma, said, “by building a bridge in the ocean by Nala you reach Laṅkā. I have been made great by you in the past.”
Rāma also reached the other banks of the mighty ocean by means of the bridge constructed by Nala with trees and rocks. Along with the monkeys he saw Laṅkā, himself remaining on the Suvela mountain.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 254 / DAILY WISDOM - 254 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 10. సంపూర్ణత విశ్వాత్మక స్వీయ స్థితిలో గ్రహించబడుతుంది🌻*
*సృష్టించబడిన జీవుల యొక్క వ్యక్తిత్వాలు అనేక జాతులు లేదా జాతుల తరాలను బట్టి మారుతూ ఉంటాయి. సాంప్రదాయ భారతీయ భావన ప్రకారం, ఈ సృష్టించబడిన జీవ జాతుల సంఖ్య ఎనభై నాలుగు లక్షల (8,400,000) వరకు ఉంటుంది. ఈ శ్రేణిలో మానవుడు అత్యున్నత స్థానాన్ని ఆక్రమించాడని చెప్పబడింది. ఈ భావన, దాని పరిణామ పథకంలో ప్రకృతి యొక్క ఉద్దేశ్యాన్ని దాదాపుగా పూర్తి చేస్తుంది. పరిణామ ప్రక్రియలో వస్తువుల సాధారణ అమరిక ఖనిజం నుండి వృక్షమునకు, వృక్షం నుండి జంతువుకు మరియు జంతువు నుండి మనిషికి క్రమంగా అధిరోహణగా పరిగణించబడుతుంది. అయితే, నీరు చొరబడని గదులలో ఉన్నట్లుగా ఈ ఐదు వర్గాలు వేరుగా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయని దీని అర్థం కాదు.*
*ఎందుకంటే ఈ ఐదు స్థాయిల వర్గీకరణలో కూడా లెక్కలేనన్ని ఉప రకాలుగా చెప్పబడే జాతులు ఉన్నాయి - ఖనిజ జగత్తులో అనేక ఉప జాతులు, వృక్ష జగత్తులోని ఉప జాతులు, జంతు జగత్తులోని ఉప జాతులు మరియు వివిధ రకాలగా ఉన్న మానవజాతి, మానవ జాతిలోని ఉప జాతులు. అలాగే మానవ అవగాహనా స్థాయి బట్టి కూడా ఉన్న అనేక రకాలు. మొత్తంగా సంఖ్య, ఎనభై-నాలుగు లక్షలు అవుతాయి. , బహుశా, వ్యక్తిత్వం యొక్క ఈ నిర్మాణంలో దాదాపుగా ఊహించలేనన్ని రకాలతో, భేదాలతో, ప్రకృతి వివరణల యొక్క అద్భుతమైన మంచి చిత్రాన్ని ఇస్తుంది. విశ్వాత్మక స్వీయ స్థితిలో సంపూర్ణతను గ్రహించే వరకు ప్రకృతి యొక్క ఈ పని పూర్తి కాదు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 254 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 10. The Absolute is Realised in a State of Universal Selfhood 🌻*
*The individualities of created beings vary according to the several species or genera into whose mould the individualities are cast. According to the traditional Indian concept, these created species of beings run to eighty-four lakhs (8,400,000) in number, in which series the human being is said to occupy the topmost position, almost completing the purpose of nature in its scheme of evolution. The general arrangement of things in the evolutionary process is considered to be a gradual ascent from mineral to plant, from plant to animal, and from animal to man.*
*This does not, however, mean that there are five categories separated as if in watertight compartments, for there is a countless variety even in this fivefold classification—varieties in the mineral constitution, varieties in the plant and vegetable kingdom, varieties in the animal kingdom and in the different kinds of subhuman species, and varieties even at the human level. The number, eighty-four lakhs, perhaps, would give a good picture of the tremendous specifications in almost unthinkable types of differentiation in the structure of individuality. Indeed nature's work is not complete until the Absolute is realised in a state of Universal Selfhood.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
#PrasadBhardwaj
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 154 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. ఏ క్షణం మనిషి స్పృహతో వుంటాడో దేవుడికి సంబంధించిన ఈ అనంత విశ్వానికి చక్రవర్తి అవుతాడు. మనిషి నిద్రలో వుండడం వల్ల ఆ సంగతి గుర్తించడం లేదు. 🍀*
*మనిషి తను బిచ్చగాడు అని ఎప్పుడూ భావించడు. తను గొప్ప చక్రవర్తినని భావిస్తాడు. ఏ క్షణం మనిషి స్పృహతో వుంటాడో దేవుడికి సంబంధించిన ఈ అనంతవిశ్వానికి చక్రవర్తి అవుతాడు.*
*నిజానికి అప్పటికే ఈ విశ్వాన్ని దేవుడు మనిషికి యిచ్చాడు. మనిషి నిద్రలో వుండడం వల్ల ఆ సంగతి గుర్తించలేదు. ఆ రాజ్యం అక్కడే వుంది. కానీ నువ్వు దాన్ని చూడ్డం లేదు. నీ చూపులు బయటికి చూస్తున్నాయి.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 93 🌹*
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻 77. సద్గురువు -1 🌻*
*తానుండుటకొక నీడ యుండవలెనని సద్గురువు భావింపడు. తనకుగ తాను గృహమేర్పరచు కొనడు. నిలయములు, నివాసములు, ఆశ్రమములు మా మార్గమున నడచు లోకహితులు కోరరు. వారికి హృదయమే శాశ్వత నిలయము. వారి నిలయము స్పందనాత్మకము. ఇటుకతో కట్టబడినది కాదు. చైతన్యముతో అల్లబడినది.*
*తన సహవాసుల హృదయములు కూడ అతనికి నివాసయోగ్యములే. వారి భవనములతో గాని, ఆస్తిపాస్తులతో గాని అతనికి సంబంధము లేదు. అతడు మానవ జీవన స్రవంతి యందు పాల్గొనియే యుండును. కాని సామాన్యులతనిని గుర్తింపలేరు. అతని మాట, చేత, చూపు ఆనందదాయకములు. అతడెచ్చటను అవసరమును మించి తిరుగడు, మాటాడడు. కాలయాపనమునకు అతని స్వభావమున చోటే లేదు.*
*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment