మైత్రేయ మహర్షి బోధనలు - 93


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 93 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 77. సద్గురువు -1 🌻

తానుండుటకొక నీడ యుండవలెనని సద్గురువు భావింపడు. తనకుగ తాను గృహమేర్పరచు కొనడు. నిలయములు, నివాసములు, ఆశ్రమములు మా మార్గమున నడచు లోకహితులు కోరరు. వారికి హృదయమే శాశ్వత నిలయము. వారి నిలయము స్పందనాత్మకము. ఇటుకతో కట్టబడినది కాదు. చైతన్యముతో అల్లబడినది.

తన సహవాసుల హృదయములు కూడ అతనికి నివాసయోగ్యములే. వారి భవనములతో గాని, ఆస్తిపాస్తులతో గాని అతనికి సంబంధము లేదు. అతడు మానవ జీవన స్రవంతి యందు పాల్గొనియే యుండును. కాని సామాన్యులతనిని గుర్తింపలేరు. అతని మాట, చేత, చూపు ఆనందదాయకములు. అతడెచ్చటను అవసరమును మించి తిరుగడు, మాటాడడు. కాలయాపనమునకు అతని స్వభావమున చోటే లేదు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

24 Mar 2022

No comments:

Post a Comment