మైత్రేయ మహర్షి బోధనలు - 101


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 101 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 81. ఊహాస్త్రము -2 🌻


మనసు ఊహించు ఈ సినిమాలో మమకారమే ప్రేమ. అసూయయే ద్వేషము. నచ్చిన వారు నవ్వినచో ప్రేమనుకొందువు. నచ్చనివారు నవ్వినచో ఎగతాళి అనుకొందువు. అంతా నీ ఊహయే. నీ అభిప్రాయమే. భగవంతుడు నీకు ఊహ నిచ్చినాడు. ఆ ఊహతో ప్రాపంచిక విషయముల యందు చిక్కుబడుచున్నావు. ఊహను సద్విషయముపై ప్రయోగింపుము. భగవంతుని గూర్చి ఊహించుము. సృష్టి వైభవము నూహించుము.

గ్రహగోళముల సంచారముల నూహించుము. ప్రాణము, తెలివి, పోకడల నూహించుము. రూపముల వైవిధ్యము నూహించుము. వర్ణముల వైభవము నూహించుము. శబ్ద తరంగముల నూహించుము. జరుగుచున్న ఓంకారము నూహించుము. ఊహకొక ప్రయోజన మున్నది. ఊహను నిష్ప్రయోజకముగ వినియోగింపకుము. అటైనచో నిష్ప్రయోజకుడ వగుదువు. ప్రయోజకుడవగుము. ఇది మా సూచన.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


09 Apr 2022

No comments:

Post a Comment