నిత్య ప్రజ్ఞా సందేశములు - 262 - 18. నిజంగా మంచిగా ఉండటమే ఒక కళ / DAILY WISDOM - 262 - 18. To be Truly Good is an Art
🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 262 / DAILY WISDOM - 262 🌹
🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀
📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 18. నిజంగా మంచిగా ఉండటమే ఒక కళ 🌻
మానవుడు ఎప్పుడూ వస్తువుల యొక్క నిజమైన స్వభావంతో ఆందోళన చెందుతూ ఉంటాడు. కారణం ఇది అసత్యం యొక్క రాజ్యానికి భిన్నంగా సత్య ప్రపంచాన్ని ప్రేమిస్తుంది. వీటి యొక్క దశలు మా మునుపటి అన్వేషణలలో క్లుప్తంగా గమనించబడ్డాయి - దీనిలో లోతైన మనస్సును సంతృప్తి పరిచే ఒక వ్యవస్థ, సమరూపత, క్రమం, ఒక నమూనా కుండే అందం, ప్రేమ వంటివి కనిపిస్తాయి. సత్యం మన ప్రశంసలను, విస్మయాన్ని మరియు ఆశ్చర్యాన్ని ఆకర్షిస్తే, అందం ప్రశాంతత, నిగ్రహం మరియు అంతర్గత ఆనందాన్ని కలిగిస్తుంది. అన్ని రకాల కళలు సౌందర్య శాస్త్రం యొక్క అధ్యయనం క్రిందకు వస్తాయి. పరిపూర్ణత స్థాయికి తగ్గట్టుగా పద్దతిగా ప్రదర్శించడంలోని నైపుణ్యమే అనేక కళలుగా వ్యక్తం అవుతూ ఉంటుంది.
మంచిగా రాయడం ఒక కళ, మంచి పరిపాలన ఒక కళ, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక కళ, లోలోపల ఎప్పుడూ సంతోషంగా ఉండటం ఒక కళ, ఒకరి వాతావరణం లేదా పర్యావరణంతో సామరస్యంగా జీవించడం ఒక కళ, తార్కికంగా ఆలోచించడం ఒక కళ. ఇలా అన్నింటిలో మంచి ఒక కళ. ‘సంతృప్తి’ కలిగించే విషయాలన్నీ కళలలో మూర్తీభవించాయి. గొప్ప కళలన్నీ సౌందర్యానికి, ఆనందానికి సంబంధించిన అత్యున్నత వస్తువులు. శిల్పములు, చిత్ర లేఖనాలు ఇలా ప్రాముఖ్యత యొక్క ఆరోహణ క్రమంలో వాటిని పేర్కొనడం మనం చూస్తాం. చిత్రాలు, సంగీతం, నృత్యం, నాటకం, అన్నింటికంటే, సాహిత్యం వంటివి ప్రముఖంగా కనబడతాయి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 262 🌹
🍀 📖 from Essays in Life and Eternity 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 18. To be Truly Good is an Art 🌻
The human individual is ostensibly concerned with the true nature of things; it loves the world of truth as distinct from the realm of untruth—stages of which have been briefly noticed in our earlier findings—but there is also the love of system, symmetry, order, pattern and beauty which satisfies the mind deeply. While truth attracts our admiration, awe and wonder, beauty evokes a sense of composure, sobriety and inner delight. All kinds of art come under the study of aesthetics. There are indeed many arts: kinds of expertness in methodical presentation to the point of perfection.
Good writing is an art, good administration is an art, maintenance of good health is an art, being always happy within is an art, to live harmoniously with one's atmosphere or environment is an art, to think logically is an art, to be truly good is an art. All things that ‘satisfy' are embodied in art. The greatest arts, supreme objects of aesthetic enjoyment are, to state them in an ascending order of importance, architecture and sculpture; drawing and painting; music, dance and drama; and, above all, literature.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
09 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment