నిర్మల ధ్యానాలు - ఓషో - 162


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 162 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అహమంటే సమస్తం నించీ వేరు చేసి నిన్ను నువ్వు చూడడం. అది జీవన్మరణం లాంటిది. అది నిన్ను అస్తిత్వం నించీ వేరు చేస్తుంది. కానీ నువ్వు సమస్తం నించీ వేరు కావు. 🍀

సత్యాన్ని అన్వేషించే వ్యక్తికి నమ్రత కలిగిన హృదయం వుండడం గొప్ప అదృష్టం. కేవలం వినయం వున్నవాళ్ళే సత్యాన్ని గ్రహస్తారు. అహంకారులకు అక్కడ ప్రవేశం లేదు. అహమే అక్కడ ఆనకట్ట. అది నిన్ను అస్తిత్వం నించీ వేరు చేస్తుంది. అహమంటే సమస్తం నించీ వేరు చేసి నిన్ను నువ్వు చూడడం. కానీ నువ్వు సమస్తం నించీ వేరు కావు. మనం ద్వీపాలం కాము. ఏ మనిషీ ద్వీపం కాడు. అనంత ఖండంలో మనం అణువులం.

అహం మనం వేరన్న పొరపాటు అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ఆ వేరన్న భావం వల్ల క్రమక్రమంగా మనం ముడుచుకుపోతాం. మనం మరీ స్వీయాత్మకంగా స్వీయకేంద్రంగా మారుతాం. ప్రపంచానికి తలుపులు మూస్తాం. సూర్యుడికి, చంద్రుడికి, గాలికి, వానకు తలుపులు మూస్తాం. గిరిగీసుకుంటాం. అది జీవన్మరణం లాంటిది. మనం మన చుట్టే సమాధి నిర్మించుకోవడమంటే అదే. ఆ సమాది కనిపించదు. కానీ అది సమాధిలాంటిదే.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

09 Apr 2022

No comments:

Post a Comment