నిర్మల ధ్యానాలు - ఓషో - 158


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 158 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. జీవితం సమగ్రమైన, సౌందర్యభరితమైన, అసాధారణమైన అస్తిత్వం. దైవత్వంతో తొణికిసలాడుతోంది. కానీ మనం గాఢంగా నిద్రిస్తూ వుండడం వల్ల ఆ జీవన వైభవాన్ని కోల్పోతుంది. 🍀


జీవితం దైవత్వంతో తొణికిసలాడుతోంది. కానీ మనం అచేతనంగా వున్నాం. మనం గాఢంగా నిద్రిస్తూ వుండడం వల్ల ఆ జీవన వైభవాన్ని కోల్పోతుంది. ఇది సమగ్రమైన, సౌందర్యభరితమైన, అసాధారణమైన అస్తిత్వం. దాన్ని అభివృద్ధి పరచడానికి ఏమీ లేనంత సమగ్రమైంది. మనం నిద్రలో వుండడంతో దాంతో సంబంధం కోల్పోయాం. అది వసంతం లాంటిది. చెట్లు పుష్పించాయి. పక్షులు పాటలు పాడుతున్నాయి. గాలి నాట్యం చేస్తోంది. అపూర్వ సౌంధర్యం అన్ని దిశలూ కళకళలాడుతోంది. కానీ నువ్వు పూలనీ చూడవు. వర్ణాల్ని దర్శించవు. గాలితో కలిసి చెట్ల నాట్యాన్ని చూడవు. అసలు నువ్వు ఉద్యానవనం మధ్యలో వున్నావనే విషయాన్నే గుర్తించవు.

నీకు నువ్వు తలుపులు బంధించుకున్నావు. వసంతంతో సంబంధం తెంచుకున్నావు. నీకేదో పీడకల వచ్చింది. ఆ పీడకలతో బాధపడుతున్నావు. ఆవేశ పడుతున్నావు. ఏడుస్తున్నావు. అరుస్తున్నావు. నీ చుట్టూ వున్న యధార్థంతో నీకు సంబంధం లేదు. నిజానికి మనిషి వాస్తవ స్థితి అది. అస్తిత్వమన్నది ఎప్పుడూ వసంతమే. దాన్ని గ్రహించాలంటే మనిషి మేలుకోవాలి. అనుభూతి చెందాలి. దాంట్లో జీవించాలి. నీ చుట్టూ వున్న పరిసరాల్ని రుచి చూడాలి. అప్పుడు నీలో గొప్ప కృతజ్ఞత మొలకెత్తుతుంది. ప్రార్థన పరిమళిస్తుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


01 Apr 2022

No comments:

Post a Comment