శ్రీ మదగ్ని మహాపురాణము - 28 / Agni Maha Purana - 28
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 28 / Agni Maha Purana - 28 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 11
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
🌻. ఉత్తర యుద్ధకాండ వర్ణనము - 1 🌻
నారదుడు పలికెను. రాజ్యము చేయుచున్న రామునివద్దకు పూజనీయులైన అగస్త్యాదులు వెళ్లిరి. ఋషులు ఇట్లు పలికిరి-నీవు ఇంద్రజిత్తును సంహరించితివి. ఈ విధముగ విజయవంతుడవైన నీవు ధన్యుడవు.
బ్రహ్మకు పులస్త్యుడను కుమారుడు కలిగెను. అతని కుమారుడు విశ్రవసుడు. అతని భార్య కైకసి. అతని ప్రతము భార్య పుష్పోద్భవ. పెద్దదైన పుష్పోద్భవకు కుబేరుడు పుత్రుడుగ జనించెను. కైకసికి ఇరువది బాహువులును, పదిముఖములును గల రావణుడు పుట్టెను. అతడె బ్రహ్మ ఇచ్చిన వరములచే దేవతల నందరిని జయించెను. నిద్రాపరవశుడైన కుంభకర్ణుడును, ధార్మికుడైన విభీషణుడును పుట్టిరి. వారికి శూర్పణఖ సోదరి. రావణునకు మేఘనాదుడను కుమారుడు పుట్టెను. రావణుని కంటె అధికబలవంతుడైన అతడు ఇంద్రుని జయించి ఇంద్రజిత్తను పేరు పొందెను. దేవతాదుల క్షేమమునకై నీవు లక్ష్మణునిచే చంపించితిని.
ఆ అగస్త్యాదులగు బ్రాహ్మణులు ఈ విధముగ చెప్పి రామునిచే పూజితులై వెళ్లిపోయిరి. దేవతలచేత ప్రార్థింపబడిన రాముని అజ్ఞచే శత్రఘ్నుడు లవణుడను రాక్షసుని సంహరించెను. పూర్వము మథుర అను పట్టణ మొకటి ఉండెను. రామునిచే అజ్ఞాపింపబడిన భరతుడు తీక్‌ష్ణములైన బాణములచే మూడు కోట్ల శైలూషపుత్రులను సంహరించెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana -28 🌹
✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj
Chapter 11
🌻 Uttara ( After War) Kand - 1 🌻
Nārada said:
I. The well-honoured sages Agastya and others went to Rāghava, who was ruling the country (and said), “You are fortunate and are victorious because you have killed Indrajit.
2. Pulastya was the son of Brahmā. Viśravas was (the son of Pulastya). Kaikasī (was his wife). (His) first (wife) was Puṣpotkaṭā.[1]. The lord of wealth (Kubera) was her son.
3. Rāvaṇa was born to Kaikasī (possessing) 20 arms and 10 faces. By means of (his) penance he got a boon from Brahmā and conquered celestials.
4. Kumbhakarṇa was always sleeping, Vibhīṣaṇa became deep-rooted in dharma. Their sister (was) Śūrpaṇakhā, Meghanāda (was born) from Rāvaṇa.
5. Having conquered Indra, he became Indrajit. He was stronger than Rāvaṇa. Desirous of welfare of the celestials, (he) was killed by you (and) Lakṣmaṇa”.
6- 7. Having told (thus) those sages Agastya and others had gone after being prostrated by (Rāma). Śatrughna directed by Rāma as per desires of celestials, became the killer of Lavaṇa at some place (known as) Mathurā. Being directed by Rāma, Bharata killed three crores of sons of Śailūṣa with sharp arrows.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
01 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment