మైత్రేయ మహర్షి బోధనలు - 97
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 97 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 79. మహాత్ముల పని -1 🌻
కలియుగమున బుద్ధుడు లాంటి వారు దేహధారులై మహత్తరమైన బోధనలను గావించిరి. వారు నిస్సందేహముగ అవతారమూర్తులే. భూమిపై నడచి భూమిని పులకింప జేసిరి. తమ బోధనలను వినువారి హృదయములను కూడ పులకింపజేసిరి. భూమి యందలి పంచభూతములను, వృక్షములను, జంతువులను, పక్షులను కూడ వారి సాన్నిధ్యముచే ప్రచోదనము గావించిరి.
అయినను ఒరిగినదేమి? అను ప్రశ్న ఎప్పటికప్పుడు మానవుని మనస్సులో పుట్టుచున్నది. వారిని రక్షకులని పిలచుట వెట్టితనమని కొందరి యుద్దేశ్యము. మానవజాతి నానాటికి క్షీణించుచున్నదని, అవతారమూర్తుల బోధనలు కూడ ఎవ్వరిని రక్షింపలేవని మేధావుల స్థూలభావము.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
01 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment