శ్రీ మదగ్ని మహాపురాణము - 40 / Agni Maha Purana - 40
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 40 / Agni Maha Purana - 40 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 14
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
🌻. మహాభారత వాఖ్యానము - 3 🌻
మహాబలశాలి యైన అశ్వత్థామ, రాత్రియందు నిద్రించుచున్న, పాండవుల, అక్షౌహిణీప్రమాణము గల సేనను ద్రౌపదీపుత్రులను, పాంచాలులను, ధృష్టద్యుమ్నుని చంపెను. పిమ్మట అర్జునుడు పుత్రహీనురాలై విలపించుచున్న ద్రౌపదిని చూచి ఆమెను ఓదార్చుటకై, ఐషీకాస్త్రముచే అశ్వత్థామ శిరోమణిని గ్రహించెను.
శ్రీ కృష్ణుడు అశ్వత్థామాస్త్రముచే దహింపబడుచున్న ఉత్తరాగర్భమును రక్షించెను. పిమ్మట ఆ గర్భన్ధశిశువు పరీక్షిన్మహారాజు ఆయెను. ఆ యుద్దమునుండి, కృతవర్మ కృపాచార్యులు, అశ్వత్థామ అను ఈ ముగ్గురు మాత్రమే ప్రాణములతో బయటపడిరి. పాండవ పక్షమున పంచపాండవులు, సాత్యకి, కృష్ణడు ఈ ఏడుగురు మాత్రమే మిగిలిరి. మరెవ్వరును మిగలలేదు.
యుధిష్ఠిరుడు దుఃఖర్తాలైన స్త్రీలను ఓదార్చి, భీమాదినమేతుడై, మరణించిన వీరు లందరికిని ప్రేత సంస్కారములను చేసి, వారికై ఉదక ధనాదిదానములు చేసి, శంతనుకుమారుడైన భీష్మునినుండి శాంతిని కలిగించు సమస్త ధర్మములను, రాజధర్మములను, మోక్షధర్మములను, దానధర్మములను విని, రాజయ్యెను. éశత్రుసంహారి యైన ఆతడు ఆశ్వమేధ మాచరించి, బ్రాహ్మణులకు దానము లిచ్చెను.
ముసలము పుట్టి యాదవు లందరును నశించి రను విషయమును అర్జునునినుండి తెలిసికొని పరీక్షిత్తను రాజ్యాభిషిక్తుని చేసి, సోదరసహితుడై స్వర్గము చేరెను.
అగ్ని మహాపురణమునందు మహాభారతఖ్యాన మను చతుర్దశాధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana -40 🌹
✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj
Chapter 14
🌻 Story of the Mahābhārata - 3 🌻
20-21. (Bhīmasena) killed his brothers with his mace. On that eighteenth day, in the night, the very strong Aśvatthāman killed the sleeping army of Pāṇḍavas of the extent of an akṣauhiṇī, the Pāñcālas and the sons of Draupadī. He also killed Dhṛṣṭadyumna.
22. Then Arjuna seized his crest-jewel with an arrow (and gave it) to that Draupadī who had lost her sons and was lamenting
23. Hari (Kṛṣṇa) revived (all of them) who were burnt by the arrows of Aśvatthāman. That embryo of Uttarā became a king (known as) Parīkṣit.
24. Kṛtavarman, Kṛpa and Drauṇi (son of Droṇa) (Aśvatthāman) survived in the battle. The five Pāṇḍavas, Sātyaki and Kṛṣṇa survived and none else.
25-26. Then that Yudhiṣṭhira having pacified the grief-stricken women, in the company of Bhīma and others, having done the obsequies for the killed warriors and having offered. waters and money and after having heard the peace-yielding dharmas, the royal duties, dharma relating to final emancipation, dharma relating to charity, became a king.
27. The destroyer of his enemy (Yudhiṣṭhira) gave away charities to the brahmins at the Aśvamedha (sacrifice). Having heard about the destruction of Yādavas[3] caused by the club and having installed Parīkṣit in the kingdom, (he) reached heavens along with the brothers.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
29 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment