శ్రీ శివ మహా పురాణము - 556 / Sri Siva Maha Purana - 556
🌹 . శ్రీ శివ మహా పురాణము - 556 / Sri Siva Maha Purana - 556 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 52 🌴
🌻. పెండ్లి వారి భోజనములు - 2 🌻
విష్ణువు మొదలగు వారందరు ఈ తీరున ఆనందముగా భుజించి నీటిని త్రాగి ప్రీతితో విశ్రమించుట కొరకై తమ తమ నివాసములకు వెళ్లిరి (13). మేన యొక్క ఆజ్ఞచే సాధ్వీమణులు శివుని భక్తితో ప్రార్థించి పరమోత్సవముతో కూడియున్న గృహమునందు నివసింప జేసిరి (14). శంభుడు మేనచే ఈయబడిన మనోహరమగు రత్న సింహాసనమునందు కూర్చుండి ఆనందముతో వాసగృహమును పరికించెను (15). మెరిసి పోయే అనేక రత్న దీపములతో శోభిల్లునది, రత్నములు పొదిగిన పాత్రలతో ఘటములతో కూడియున్నది, ముత్యములతో మణులతో విరాజిల్లునది అగు మందిరమును చూచెను (16).
రత్నపుటద్దముల శోభతో విరాజిల్లునది, తెల్లని చామరములతో అలంకరింపబడినది, ముత్యముల మణుల మాలలతో అలంకరింపబడినది, మహాసంపదలతో కూడియున్నది (17), సాటిలేనిది, మహా దివ్యమైనది, రంగు రంగులది, మిక్కిలి మనోహరమైనది, చిత్తమునకు ఆహ్లాదమును కలిగించునది, నేలపై వివిధ రచనల శోభ గలది (18), శివుడు ఇచ్చిన వర ప్రభావము వలననే నిర్మాణమైనది, శివలోకమను నామధేయము గలది (19), అనేక సుగంధ ద్రవ్యములచే పరిమిళ భరతమైనది, చందనము, అగరులతో కూడినది, పుష్పశయ్యలతో కూడియున్నది అగు గృహమును చూచెను (20).
అనేక చిత్ర విచిత్రములతో ప్రకాశించునది, విశ్వకర్మచే నిర్మింపబడినది, శ్రేష్ఠ రత్నములతో తయారైన శ్రేష్ఠ హారములతో అలంకరింపబడినది (21) అగు గృహమును చూచెను. ఆ గృహములో ఒకచోట దేవతలచే నిర్మింపబడిన మిక్కిలి అందమగు వైకుంఠము, మరియు బ్రహ్మలోకము, మరియొక చోట లోకపాలకుల నగరము (22), ఒకచోట రమ్యమగు కైలాసము, మరియొక చోట ఇంద్ర భవనము, వీటన్నిటిపై విరాజల్లే శివలోకము రచింపబడి యుండెను (23).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 556 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 52 🌴
🌻 The bridegroom’s party is fed and Śiva retires to bed - 2 🌻
13. After taking meals and rinsing their mouths Viṣṇu and others went to their apartments for rest.
14. At the bidding of Menā, the chaste ladies requested Śiva humbly and made Him stay in the bedchamber where great festivities were going on.
15. Seated on a gemset throne offered by Menā, Śiva surveyed the bedchamber with pleasure.
16. It was brightly illuminated with hundreds of gemset lamps. There were many gemset vessels. Pearls etc. were gorgeously displayed.
17. Gemset mirrors, white chowries, pearl necklaces and gorgeous things were richly displayed.
18. It was unequalled in its divine exquisiteness highly pleasing and richly decorated.
19. It was evincing the powerful influence of the boon granted by Śiva. It appeared to be a replica of Śiva Loka itself.
20. It was richly rendered fragrant with various sweet smelling substances. It was very bright. There was sandal paste and aguru. Beds were richly strewn with flowers.
21. Many wondrous things of variegated colours and shapes were displayed there. It had been constructed in gems by Viśvakarman[1] himself.
22. In some places replicas of Vaikuṇṭha, Brahmaloka and the cities of the guardians of the quarters were seen.
23. In a certain place the beautiful Kailāsa was represented. In another place Indra’s palace was depicted. Over all was represented the Śivaloka.
Continues....
🌹🌹🌹🌹🌹
29 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment