శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 367-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 367-1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 367-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 367-1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀

🌻 367-1.‘ప్రత్యక్చితీ’🌻


అంతర్ముఖముగ ఆత్మదర్శనము చేయుచు నుండునది శ్రీమాత అని అర్థము. ప్రత్యక్చితినే ప్రతీచి యని కూడా అందురు. అవ్యక్తమగు పర తత్త్వము నుండి విడివడి ఎదురుగ నిలచి పరతత్వమునే దర్శనము చేయుట ప్రత్యక్చితి అందురు. పశ్చిమమున నుండి తూర్పును దర్శించుట వలన కూడ ప్రతీచి అని పిలువబడును. శుద్ధ చైతన్యముగ అవ్యక్తము నుండి ప్రత్యేకముగ విడువడినది గనుక ప్రత్యక్చితి అని పిలుతురు. ప్రళయము పిదప సృష్టి ప్రారంభమునకు మొదటి మేలుకొలుపై ఏర్పడు సంకల్పము అని తెలియదగును. నిద్ర నుండి అపుడపుడే యేర్పడుచున్న ప్రాగ్ అవస్థ అనికూడ తెలియవచ్చును.

ఈ అవస్థను విచికీర్ష అని కూడ అనవచ్చును. ఇచ్ఛ కారణముగ నిద్ర నుండి మెలకువ వచ్చును. కావున ప్రథమమగు ఇచ్ఛయే విచికీర్ష అనవచ్చును. విచికీర్ష ఉద్భవించి ఈవలకు వచ్చి అభిముఖమై వున్నప్పుడు ప్రత్యక్చితి అందురు. అనగా చైతన్య రూపమున ప్రత్యేకమై ఎదురుగ నిలబడినది అని అర్థము. విడివడి ప్రత్యేకముగ నున్ననూ ఆత్మనే దర్శించు స్థితి, ఆత్మజ్ఞానము నందున్న స్థితిని ప్రత్యక్చితి అని నిర్వచింప వచ్చును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 367-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata
Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻


🌻 367-1. Pratyak-citī-rūpā प्रत्यक्-चिती-रूपा 🌻

Pratyak means turned towards the inner soul and cit means consciousness. She is in the form of inner consciousness which is known as inner Self. Pratyak is opposed to parāk, which means turned outwards that happens with the help of senses. Inner consciousness is considered as the supreme level of consciousness. Life energy interacts with internal awareness, paving way for higher level of consciousness.

The lower or higher level of consciousness purely depends upon the purity of the mind. Purity of the mind depends upon the level of usage of sensory organs. Looking within means, the process of interaction between life energy or prāṇa with consciousness or cit. This is called the Supreme Self or the Brahman in un-manifested form, which is the essential nature of the Brahman.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


01 May 2022

No comments:

Post a Comment