శ్రీ శివ మహా పురాణము - 557 / Sri Siva Maha Purana - 557
🌹 . శ్రీ శివ మహా పురాణము - 557 / Sri Siva Maha Purana - 557 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 52 🌴
🌻. పెండ్లి వారి భోజనములు - 3 🌻
అందరిచే ఆశ్చర్యముతో చూడబడే ఇట్టి గృహమును చూచి మహేశ్వరుడు హిమవంతుని ప్రశంసించి సంతుష్టుడాయెను (24). ఆ భవనములో ఉత్తమము అతిరమణీయము అగు రత్నపర్యంకముపై పరమేశ్వరుడు ఆనందముతో కూడిన వాడై లీలగా శయనించెను (25).
హిమవంతుడు తన సోదరులను, ఇతరులను చక్కని మృష్టాన్నముతో ఆనందింపజేసి ఇతర కృత్యములను కూడ చేసెను (26). హిమవంతుడు ఇట్లు కార్యమగ్నుడై యుండగా, ప్రియతముడగు ఈశ్వరుడు నిద్రించుచుండగా, రాత్రి గడచిపోయి, ప్రాతఃకాలమయ్యెను (27). అపుడా ప్రభాత సమయములో జనులు ధైర్యోత్సాహములతో నిండినవారై అనేక రకముల వాద్యములను మ్రోయించిరి (28).
విష్ణువు మొదలగు దేవతలందరు ఆనందముతో నిద్రలేచి తమ ఇష్టదైవమగు ఈశ్వరుని స్మరించి తొందరగా సంసిద్ధులైరి (29). వారు కైలాసమునకు వెళ్లుటకై ఉత్సుకత గలవారై తమ వాహనములను సిద్ధము చేసుకొని ధర్ముని శివుని వద్దకు పంపిరి (30). యోగి యగు ధర్ముడు అపుడు వాసగృహమునకు వచ్చి నారాయణుని ఆజ్ఞచే యోగిశ్రేష్ఠుడగు శివునితో సమయానురూపముగా నిట్లు పలికెను (31).
ధర్ముడిట్లు పలికెను-
ఓ ప్రమథ పతీ! లెమ్ము, లెమ్ము, నీకు మంగళమగుగాక! మాకు మంగళములనిమ్ము. జనుల నివాసము వద్దకు రమ్ము. ఆచట వారిని కృతార్థులను చేయుము (32).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 557 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 52 🌴
🌻 The bridegroom’s party is fed and Śiva retires to bed - 3 🌻
24. Seeing all these wonderful representations lord Śiva praised Himavat and was very glad.
25. In that bedchamber, in a beautiful gemset couch lord Śiva lay down with pleasure.
26. Himavat fed all his brothers and others with pleasure and attended to the subsequent duties.
27. While the supreme lord had his sleep and the lord of the mountains was engaged in these duties, the night passed away giving place to dawn.
28. In the morning the enthusiastic people began to play on different kinds of musical instruments.
29. Viṣṇu and the other gods got up with joy, remembered the lord of gods and excitedly got ready.
30. They got their vehicles ready for the departure to Kailāsa and sent Dharma to Śiva.
31. At the bidding of Viṣṇu, Dharma went near the bed chamber. The Yogin Dharma addressed Śiva, the lord of Yogins, in a manner befitting the context.
Dharma said:—
32. Get up, get up O Śiva, O lord of the Pramathas. Please come over to the audience hall. Make the assembled people gratified.
Continues....
🌹🌹🌹🌹🌹
01 May 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment