శ్రీ మదగ్ని మహాపురాణము - 41 / Agni Maha Purana - 41


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 41 / Agni Maha Purana - 41 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 15

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. పాండవ చరిత వర్ణనము - 1 🌻


అగ్ని పలికెను: ఓ ద్విజుడా! యుద్ధిష్ఠురుడు రాజ్యము చేయుచుంéడగా ధృతరాష్ట్రడును, గాందారియు, కుంతియు, అరణ్యమునకు వెళ్ళి ఒక ఆశ్రమమునుండి మరి యొక ఆశ్రమమునకు సంచరించుచుండిరి.

విదురుడు దావాగ్నిచే దగ్ధుడై మృతి చెందెను. ఈ విధముగ మహావిష్ణువు పాండవులను నిమిత్తముగ చేసి కొని, ధర్మరక్షణముకొరకును, అధర్మవినాశమునకు, పూనుకొని దానవాదిక మగు భూభారమును హరించెను. విప్రశాప మను వంకచే, ముసలముచే, భూభారకర మగు యాదవకులమును నశింపచేసెను.

శ్రీకృష్ణుడు వజ్రుని రాజ్యాభిషిక్తుని చేసి దేవతల ఆదేశమునే ప్రభాసక్షేత్రమునందు తన దేహమును పరిత్యజించి, ఇంద్రలోక బ్రహ్మలోకములందు స్వర్గవాసులచే పూజింపబడెను. బలరాముడు ఆదిశేషరూపధారి యై పాతాళ స్వర్గము చేరెను.

వినాశరహితు డగు ఆ శ్రీ హరి యోగులచే ధ్యానింపబడు వాడు. అట్టి శ్రీ కృష్ణుడు లేని ద్వారకను సముద్రము ముంచివేసెను.

అర్జునుడు యాదవులకు ప్రేత సంస్కారాదులు చేసి ఉదకధనాదిదానములు చేసెను. అష్టావక్రుని శాపముచే విష్ణుభార్యలుగా అయిన స్త్రీలను, మరల అతని శాపము చేతనే, కఱ్ఱలు ఆయుధములుగా గల రోపాలకులు అర్జునుని ఓడించి తీసికొని పోయిరి. అర్జునుడు చాల శోకించెను. వ్యాసు డాతనిని ఊరడించెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 41 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj


Chapter 15

🌻 Ascendance of Pāṇḍavas to heaven - 1 🌻


Agni said:

1. O Brahmin! When Yudhiṣṭhira was ruling the kingdom, Dhṛtarāṣṭra went to the forest along with Gāndhārī and Pṛthā (Kuntī) and passed from one stage of life to another.

2-5. Vidura was burnt by the forest fire and ascended heavens. Thus, Viṣṇu removed the oppression of demons and others on the earth, for the sake of dharma and for the destruction of adharma and having the Pāṇḍavas as an apparent cause. Having the curse of a brahmin, as a pretext, he destroyed with the club, the race of Yādavas who were oppressing (the world) Then (he) installed Vajra (son of Aniruddha) in the kingdom. On the directive of celestials, Hari himself having discarded his body at Prabhāsa, is being worshipped by the residents of heavens at the worlds of Indra and Brahmā. Balabhadra, (who was) a form of Ananta, reached heavens in the nether world.

6. Hari, the imperishable lord, is always to be contemplated upon by those who meditate (on him). Without him (at Dvārakā), the ocean flooded the city of Dvārakā.

7-8. Pārtha (Arjuna), having performed the obsequies of Yādavas, and having offered the waters of oblation and money, felt grief-stricken when the women, who were the wives of Viṣṇu (Kṛṣṇa), were carried away by the shepherds (using) the clubs as weapons and defeating Arjuna on account of the curse of Aṣṭāvakra.[1]


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


01 May 2022

No comments:

Post a Comment