శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 368 / Sri Lalitha Chaitanya Vijnanam - 368
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 368 / Sri Lalitha Chaitanya Vijnanam - 368 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀
🌻 368. 'పశ్యంతీ’🌻
సమస్తమును చూచునది శ్రీదేవి అని అర్థము. ఇచ్చట చూచుట అనగా ఆత్మయందు దర్శించుట. శ్రీదేవి తన ఆత్మయందు సమస్తమును చూచుచు నుండును. అంతయు ఆమె యందే జరుగుచుండగా సాక్షీభూతమై చూచు చుండును. పరాస్థితి తరువాత స్థితి పశ్యంతి స్థితి. పశ్యంతి యందున్నప్పుడు కరణము, కారణము, కర్త ఇత్యాది వేవియు నుండవు. ఈ స్థితిలో పరమును గూర్చిన ధ్యానము సతతము యుండును. అట్లే సృష్టి దర్శనము కూడ నుండును.
శ్రీమాత చైతన్య స్వరూప మగుట వలన తన యందలి పరమేశ్వరునితో అను సంధానమై సమస్తమును దర్శించుచు నుండును. ఆమె నుండి వ్యక్తమైన ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులు సమస్త కార్యములను చక్కబెట్టు చుండును. ఆత్మ దర్శనులకు ఇది అత్యుత్తమ స్థితి. ఈ స్థితినే అందరును కోరుదురు. ఈ స్థితిలో పరమపదము చేరువలో నుండగా తమ నుండి ఇచ్ఛా, జ్ఞాన, క్రియలు జరుగుచుండును. వానిని తామును గమనించుచునే యుందురు. వశిష్ఠాది బ్రహ్మ ఋషు లట్టివారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 368 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata
Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻
🌻 368. Paśyantī पश्यन्ती 🌻
Nāma 366 said that paśyantī is the second stage in the evolution of sound. The union of Śiva and Śaktī is the primary stage of sound which is called parā. This primary stage leads to the next stage called paśyantī where the first differentiation begins to appear in the process of evolution of speech. In this level, the sound becomes more perceptible but continues to be inaudible, though not yet isolated.
The previous nāma suggested that one should look within to explore the inner consciousness. But what happens if inner consciousness is explored? It leads to the beginning of differentiation in the form of visionary wherein the Self begins to realize all others as its own. This nāma says that She is in this form of speech. The concept is that She is the beginning and end of speech. It can also be said that speech originates and dissolves in Her.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
05 May 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment