శ్రీ శివ మహా పురాణము - 559 / Sri Siva Maha Purana - 559
🌹 . శ్రీ శివ మహా పురాణము - 559 / Sri Siva Maha Purana - 559 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 53 🌴
🌻. శివుని కైలాస యాత్ర - 1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను-
అపుడు విష్ణువు మొదలగు దేవతలు, తపోధనులగు మునులు అవశ్యమగు పనులను పూర్తి చేసుకొని కైలాసయాత్రకు సన్నద్ధులైరి (1). అపుడు హిమవంతుడు స్నానము చేసి ఇష్టదైవమును శ్రద్ధగా పూజించి పౌరులను బంధువులను దోడ్కెని పెళ్లివారి మకామునకు వెళ్లెను (2). అచట శివప్రభుని ఆనందముతో పూజించి ఇట్లు ప్రార్థించెను. నా గృహములో కొద్ది రోజులు అందరితో కలిసి నివసించుము (3).
హే శంభో! నిన్ను దర్శించుట చేత, దేవతలతో గూడి నీవు నా ఇంటికి వచ్చుట చేత నేను కృతార్థుడను, ధన్యుడను అయితిననుటలో సందేహము లేదు (4).
పర్వతరాజు ఈ తీరున చేతులు జోడించి నమస్కరించి విష్ణువు, దేవతలను, ఇతరులను, శివ ప్రభుని అనేక విధములుగా ఆహ్వానించెను (5). విష్ణువు మొదలగు దేవతలతో గూడిన మునులు శివుని సాదరముగా మనస్సులో స్మరించి అపుడిట్లు బదులిడిరి (6).
దేవతలిట్లు పలికిరి-
ఓ గిరిరాజా! నీవు ధన్యడవు. నీ కీర్తి చాల గొప్పది. ముల్లోకములలో నీ అంతటి పుణ్యాత్ముడగు జనుడు మరియొకడు లేడు (7). పరబ్రహ్మ, సత్పురుషులకు శరణము, భక్తవత్సలుడు అగు మహేశ్వరుడు తన కింకరులతో గూడి నీఇంటికి దయ చేసినాడు (8).
ఇచటి విడిది చాల సుందరము గనున్నది. వివిధ సన్మానములను చేసి యుంటివి. ఓ పర్వతరాజా! అపూర్వములైన భోజనములను వర్ణింప శక్యము కాదు (9). దీనిలో వింత ఏమీ లేదు. ఏలయన ఎచట జగన్మాతయగు శివాదేవి గలదో, అచట సర్వము పరిపూర్ణమగును. మేము ఇచటకు వచ్చి ధన్యులమైతిమి (10).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 559 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 53 🌴
🌻 Description of Śiva’s return journey - 1 🌻
Brahmā said:—
1. Then Viṣṇu and other gods, the sages and ascetics sent message to the mountain about their intention to leave after finishing their immediate duties.
2. Then the lord of mountains finished his ceremonial ablution and the worship of his favourite deity. Calling his kinsmen in the city, he came to the audience hall joyously.
3. There he worshipped the lord with pleasure and requested him to stay in his house for a few days more along with all the people.
4. “O Śiva” he said “I am contented by your sight. I am blessed since you came here with the gods”.
5. Saying these words and many more, the lord of mountains pleaded with palms joined in reverence to the lord along with Viṣṇu and other gods.
6. Then the gods and sages remembered Śiva and spoke with delight.
The gods said:—
7. O lord of the mountains, you are blessed. Your glory is great. Even in the three worlds, there is none equal to you in merit.
8. At your very door, lord Śiva, the supreme Brahman, the goal of the good and favourably disposed to His devotees, has deigned to come along with us, His slaves.
9. O lord of mountains, this audience hall is very excellent. You have honoured us in diverse ways. The foodstuffs served to us were extraordinary. It is impossible to describe them suitably.
10. It is no wonder that everything is perfect where the goddess Pārvatī is present. We too are blessed since we came.
Continues....
🌹🌹🌹🌹🌹
05 May 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment