శ్రీ మదగ్ని మహాపురాణము - 43 / Agni Maha Purana - 43


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 43 / Agni Maha Purana - 43 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 16

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. బుద్ధ కల్క్యవతార వర్ణన- 1 🌻


అగ్ని పలికెను. బుద్ధావతారమును గూర్చి చెప్పెదను. ఇది చదువువానికిని వినువానికిని గూడ మంచి ప్రయోజనమును చేకూర్చును. పూర్వము దేవాసుర యుద్ధము జరిగెను. ఆ యుద్ధమున పరాజితు లైన దేవతలు ''రక్షింపుము రక్షింపుము అని ప్రార్థించుచు పరమేశ్వరుని శరణు జొచ్చిరి.

అపుడు మాయామోహ స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు శుద్ధోదనుని కుమారుడుగా జనించి, దైత్యులకు మోహము కలిగించి, వారు వేదధర్మమును విడచునట్లు చేసెను. వారందరును బౌద్ధులైరి. ఆ పరమేశ్వరుడే ఆర్హతుడై, మిగిలిన వేదవర్జితుల నందరిని ఆర్హతులను చేసెను. ఈ విధముగ దైత్యులు వేద ధర్మాదివర్జితు లైన పాషండులుగా ఆయిరి.

వారు నరకమును ఇచ్చు కర్మలు చేసిరి. వీరందరును అధమునినుండి కూడ ప్రతి గ్రహము చేయుదురు. కలియుగాంతమున సంకర మగుదురు. శీలరహితు లైన దొంగ లగుదురు. పదునైదు శాఖలు గల వాజసనేయ వేదము ప్రమాణము కాగలదు. ధర్మ మను చొక్కా తొడిగికొనిన మ్లేచ్ఛులు, రాజులై, అధర్మమునందు ఆసక్తి కలవారై మనుష్యులను భక్షించగలరు. (పీడించగలరు.)


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Agni Maha Purana - 43 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj


Chapter 16

🌻 Manifestation of Viṣṇu as Buddha and Kalki - 1 🌻


Agni said:

1. I am describing the manifestation (of Viṣṇu) as Buddha, by reading and hearing which one gets wealth. Once in the battle between devas and asuras, devas were defeated by the daityas (demons, sons of Diti).

2. They sought refuge in the lord saying, “Protect us! Protect us!”. He (Viṣṇu), who is of the form of illusory delusion became the son of Śuddhodana.

3-4. He deluded those demons. Those, who had abandoned the path laid down in the Vedas, became the Bauddhas and from them others who had abandoned the Vedas. He then became the Arhat (Jaina). He then made others as Arhats. Thus the heretics came into being devoid of vedic dharmas.

5-6. They did such a work deserving hell (as reward). They would receive even from the vile. All of them became mixed Dasyus and devoid of good conduct at the end of Kaliyuga. Of the Vājasaneyaka veda (Śuklayajurveda) only fifteen sections will be existing.

7. Non-aryans in the form of kings would devour men who wear the costumes of righteousness and have a taste for unrighteous thing.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


05 May 2022

No comments:

Post a Comment