శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 370-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 370-1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 370-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 370-1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀
🌻 370 -1. ‘మధ్యమా’ 🌻
శ్రీదేవి మధ్యమా వాక్ స్వరూపిణి అని తెలుపు నామమిది. మధ్యమ అనగా రెంటి నడుమ వుండునది. ఈ సందర్భమున శ్రీదేవి పశ్యంతి వాక్కునకు, వైఖరి వాక్కునకు నడుమ యుండు ప్రజ్ఞ యని తెలియవలెను. పశ్యంతి దర్శన జ్ఞానము, మధ్యమ దర్శనము గూర్చిన భావము. వైఖరి భాషా రూపము. పరము ఆధారముగ పశ్యంతి యేర్పడు చుండును. పశ్యంతి ఆధారముగ భావ మేర్పడును. భావము ఆధారముగ భాష ననుసరించి మాటాడుట యుండును.
ఇట్లు వాక్కు నాలుగు విధములుగ అవతరించు చుండును. "చత్వారి వాక్పరిమితా పదాని”అని ఋగ్వేదము వాక్కును ప్రశంసించును. వాక్ స్థితులు నాలుగు. అందు పర, జ్ఞానులకే పరిమితము. పశ్యంతి మధ్యమ వైఖరి అందరికి అందుబాటులో నుండును. పశ్యంతి అనగా దర్శించుట గ్రహించుట తెలియుట. ఈ తెలిసిన దానికి భావము ఒక తొడుగు. ఎవరు గ్రహించిన విషయమును వారు, వారి భావముగ ప్రకటింతురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 370 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata
Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻
🌻 370-1. Madhyamā मध्यमा 🌻
The next higher level of paśyantī is madhyamā. This stage is called intermediary stage between the origin and the end of speech. Here the duality begins to appear. This is the stage where the individual consciousness, the psychological result of perception, learning and reasoning, where the mind develops capacity to analyze and differentiate has not reached the empirical level.
At this level, intellect, one of the components of antaḥkaraṇa begins to influence the consciousness which is in the impersonal stage of development. This is a stage where one can talk to himself.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
09 May 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment