శ్రీ మదగ్ని మహాపురాణము - 45 - సృష్టి వర్ణనము - 1 / Agni Maha Purana - 45 - Description of Creation - 1
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 45 / Agni Maha Purana - 45 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 17
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
🌻. సృష్టి వర్ణనము - 1 🌻
అగ్ని పలికెను- ఇపుడు విష్ణువుయొక్క జగత్సృష్టలి మొదలగు క్రీడను గూర్చి చెప్పెదను, వినుము. స్వర్గాదులను నిర్మించిన ఆతడే సృష్టికి ఆది యైనవాడు ఆతడు గుణములు కలవాడు. నిర్గుణుడు కూడ.
ప్రారంభమున సద్రూప మేన బ్రహ్మయే ఆవ్యక్తావస్థలో ఉండెను. ఆకాశము గాని, రాత్రి గాని, పగలు కాని లేకుండెను. (ఆ బ్రహ్య) ప్రకృతిని, పురుషుడైన విష్ణువును ప్రవేశించి క్షోభింపచేసెను.
సృష్టి సమయయున ఆ ప్రకృతి పురుషుల క్షోభవలన మహత్తత్త్వము జనించెను. దానినుండి ఆహంకారము జనించెను. ఇంద్రియాది వికారములకు కారణ మైన అహంకారము తైజనము. పంచభూతములకు కారణ మైనది తామసము.
ఆహంకారమునుండి శబ్దతన్మాత్రరూప మైన ఆకాశము. దానినుండి స్పర్శతన్మాత్రరూప మైన వాయువు, దానినుండి రూపతన్మాత్రరూప మైన అగ్ని, దానినుండి రసతన్మాత్రరూప మైన ఉదకము, దానినుండి గంధతన్మాత్రరూప మైన పృథివియు జనించెను. ఇవన్నియు తామసాహంకారము నుండి జనించెను. పిదప (తైజసాహంకారము నుండి తైజసమైన ఇంద్రియములు పది వైకారికదేవతలు, పదకొండవ ఇంద్రియ మైన మనస్సు పుట్టినవి. పిమ్మట భగవంతుడైన బ్రహ్మ వివిధ ప్రజలను సృజింప దలచినవాడై ముందుగా జలమును సృజించెను. దానియందు తన వీర్యమును విడచెను. ఉదకమునకు నారములు అని పేరు. ఆవి నరుని వలన పుట్లెను. కదా. పూర్వము నారములు అనగా ఉదకములు, నరునకు స్థాన మాయెను. ఆందుచే ఆతడు నారాయణు డని చెప్పబడెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 45 🌹
✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj
Chapter 17
🌻 Description of Creation - 1 🌻
Agni said:
1. I shall describe now the creation of the universe. which is the sport of Viṣṇu.[1] He who creates heaven etc. is the beginning of the creation and is endowed with qualities and is without qualities.
2. Brahmā, the unmanifest, was the existent being. There was no sky, neither the day nor the night etc. Viṣṇu having entered the nature (Prakṛti) and the soul (Puruṣa), then agitated them.
3. At the time of creation, the intellect (Mahat) (emanated first). The ego (Ahaṅkāra) came into being then, and then the evolutes(Vaikārikas),[2] the lustre (taijasa), the elements etc. and the darkness (tāmasa).[3]
4. Then emanated the ether, the sound-principle from the ego. Then the wind, the principle of feeling and the fire, the colour-principle came into being from it.
5. The water, the taste-principle (came into being) from this. The earth is known as the smell-principle. From the darkness (born of) ego, the senses (came into being) (which) are lustrous.
6. The evolutes are the ten celestials and the mind, the eleventh sense. Then the lord Svayambhū[4] Brahmā became desirous of creating different types of beings.
7. He created waters first. The waters are referred to as nārāḥ because they are the creation of the Supreme spirit.
8. Since his motion was first in them, he is known as Nārāyaṇa. That egg lying in the water was golden in colour.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
09 May 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment