శ్రీ శివ మహా పురాణము - 561 / Sri Siva Maha Purana - 561


🌹 . శ్రీ శివ మహా పురాణము - 561 / Sri Siva Maha Purana - 561 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 53 🌴

🌻. శివుని కైలాస యాత్ర - 3 🌻


ఓ మహర్షీ! ఇదే తీరున మూడవనాడు కూడా ఆ పర్వతరాజు వారికి యథావిధిగా వస్తువలనిచ్చి, ఆదరమును చూపి సన్మానించెను (20) నాల్గవనాడు శుద్ధిగా యథావిధిగా చతుర్థీకర్మ ఆచరింపబడెను. దీనిని ఆచరించనిచో వివాహయజ్ఞము భగ్నమగును (21). అపుడు వివిధములగు ఉత్సవములు జరిగినవి. సాధువాదము, జయధ్వనులు మిన్నుముట్టినవి. అనేక దానములు చేయబడెను. నృత్యములు, వివిధ గానములు ప్రవర్థిల్లెను (22).

అయిదవ రోజు ఉదయమే దేవలందరు అత్యానందముతో, అతి ప్రేమతో హిమవంతునకు తిరుగు యాత్ర గురించి విన్నవించిరి (23). ఆ మాటను విని హిమవంతుడు చేతులు జోడించి దేవతలతో 'ఓ దేవతలారా! దయచేసి మరికొన్ని రోజులు ఉండుడు' అని కోరెను (24). ఇట్లు పలికి ఆయన ప్రేమతో వారిని, శివుని, విష్ణువును, నన్ను, ఇతరులను చాల రోజులు అక్కడనే నిలిపివేసి, నిత్యము గొప్ప ఆదరమును చూపెను (25). అక్కడ నివసించి యుండగనే వారికి అనేక దినములు ఈ తీరున గడిచి పోయినవి. తరువాత దేవతలు పర్వతరాజు వద్దకు సప్తర్షులను పంపిరి (26).

వారు మేనకు సమయోచితముగా పరమ శివతత్త్వమును యథావిధిగా బోధించి ఆమెను ఆనందముతో ప్రశంసించిరి (27). ఓమునీ! వారు వారు చెప్పగా పరమేశ్వరుడు యాత్రకు అంగీకరించి దేవతలు మొదలగు వారితో గూడి హిమవంతుని వద్దకు వళ్లెను (28). దేవ దేవుడు అగు శివుడు దేవతలతో గూడి యాత్రకు సంసిద్ధమగు చుండగా ఆ మేన బిగ్గరగా విలపించి దయానిధి యగు శంభునితో నిట్లనెను (29).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 561 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 53 🌴

🌻 Description of Śiva’s return journey - 3 🌻



20. O sage, on the third day similarly they were thus duly honoured by the lord of mountains with customary gifts.

21. On the fourth day, the rite of Caturthīkarman[1] was performed with due observance. Without this the marriage rites would have been incomplete.

22. There was diverse jubilant festivity. Shouts of “well-done”, “Victory” etc were heard. There were exchanges of gifts, sweet music and different kinds of dances.

23. On the fifth day the delighted gods lovingly intimated to the mountain about their desire to go back.

24. On hearing that, the lord of mountains spoke to the gods with palms joined in reverence “O gods, please stay a few days more”.

25. Saying thus with great love he made all of us, the lord, Viṣṇu and others stay there for many days, honouring us duly every day.

26. Thus many days elapsed as the gods continued to stay there. Then the gods sent the seven sages to the lord of the mountains.

27. They enlightened the mountain and Menā with what was relevant to the occasion. They told them about Śiva’s principles with due praise.

28. O sage, the proposal was agreed to by the great lord. Then Śiva went to the mountain to tell him about the intended journey, along with the gods and others.

29. When the lord of gods started on his journey towards his mountain along with the gods, Menā cried aloud and told the merciful lord.


Continues....

🌹🌹🌹🌹🌹


09 May 2022

No comments:

Post a Comment